పూటకూళ్ళ ఇల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూర్వం దూర ప్రయాణాలు చేసేవారు విశ్రాంతి తీసుకోవడానికి హోటల్స్ ఉండేవి కావు. గ్రామాలలో కొన్ని మధ్య తరగతి కుటుంబాల వారు బ్రతుకు తెరువు కోసం పూటకూళ్ళ ఇళ్ళు నడిపేవారు. ఈ గ్రామాల మీదుగా వెళ్ళే యాత్రికులు భోజన సమాయానికి ఈ పూటకూళ్ళ ఇళ్ళకు చేరుకునేవారు. ఇలా వచ్చిన వాళ్ళ సంఖ్యను చూసుకొని, వాళ్ళు కాలు చేతులు కడుక్కొని సేద తీరేంతలో వారికి భోజనాలు తయారుచేసి పెట్టేవారు. ఇందుకు ప్రతిఫలంగా కొంత సొమ్మును పుచ్చుకొనేవారు. ఇంకా కొన్ని ఇళ్ళలో రాత్రులు బస చేయడానికి కూడా సౌకర్యాలుండేవి. పూటకూళ్ళ ఇల్లు 18, 19 శతబ్దాలలో, అనగా బ్రిటీషువారి భారతదేశ పాలన మధ్యకాలానికి కనుమరుగయ్యాయి. ఒకవిధంగా పూర్వం ఉన్న పూటకూళ్ళ ఇళ్ళు నేడు హోటల్స్ గా రూపాంతరం చెందాయని కొంతమంది అభిప్రాయం.


  • శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంత చిరునామా హైదరాబాదు. పుట 70

మన ప్రాచీనులు అన్నము నమ్ముట నీచమైన కార్యముగా భావించి నిషేదించిరి. కావున ఇది ఆంధ్రములో ఈ 1000 ఏండ్లలోనే ప్రబలియుండును. నగరాలుండుచోట పూటకూళ్లు తప్పక ఏర్పడును. ఆంధ్రనగరమున బరగిన ఓరుగల్లు ఒక మహానగరమై యుండినందున పూటకూళ్ళుకూడా అందు నెలకొనెను. దానిని క్రీడాభిరామకర్త ఈ క్రింది పద్యమున యిట్లు వర్ణించెను.

"సంధివిగ్రహయానాది సంఘటనల
        ఖందకీజారులకు రాయబారి యగుచు
        పట్టణంబున నిత్యంబు పగలురేయి
        పూటకూటింట వర్తించు పుష్పశరుడు"

ఒక్కరూక యిచ్చిన యేమేమి లభిస్తుండెనో ఈ క్రింది పద్యములో తెలిపినారు. తెలిపినాడు.

"కప్పురభోగి వంటకము
        కమ్మని గోధుమపిండి వంటయున్
        గుప్పెడు పంచదారయును
        క్రొత్తగ కాచిన యాలనే, పెసర్
        పప్పును, గొమ్మునల్లనటి
        పండ్లును, నాలుగునైదు నంజులున్
        లప్పలతోడ క్రొంబెరుగు
        లక్ష్మణవజ్ణలయింట రూకకున్."

ఇంకేమి కావలెను? ఇది ఉత్తమాహారము (Balanced diet), కప్పుర భోగి అనునవి సన్నబియ్యపు జాతి. ఈనాడు మహారాజు భోగాలు అన్నట్టివి. (మూలము) *https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/90[permanent dead link]