Jump to content

పూణెరీ పగడి

వికీపీడియా నుండి
పూణెరీ పగడిలో మహదేవ్ గోవింద్ రనడే

పూణెరీ పగడి అనేది పూణె నగర గౌరవం, ప్రతిష్ఠలకు చిహ్నంగా పరిగణించే తలపాగా[1] ఇది ధరించే సంప్రదాయం రెండు శతాబ్దాల క్రితం ప్రారంభమయింది.[2] ఇది గౌరవ చిహ్నమే అయినా పగడి వాడుక సంవత్సరాలుగా మారిపోయింది, ప్రస్తుతం కూడా కళాశాలల్లో సంప్రదాయ ఉత్సవాల రోజుల్లో ధరిస్తున్నారు.[3] పగడి గుర్తింపును రక్షించేందుకు, స్థానికుల నుంచి భౌగోళిక గుర్తింపును కల్పించాలన్న డిమాండ్లు వచ్చాయి.[3] వారి కోరిక నెరవేరుస్తూ 4 సెప్టెంబర్ 2009 నుంచి పగిడిని మేధోహక్కుగా గుర్తించారు.[1][3][4][5][6]

చరిత్ర

[మార్చు]
1890 నాటి, పగడి తయారుచేస్తున్న వారి చిత్రం

19వ శతాబ్దంలో సంఘసంస్కర్త మహదేవ్ గోవింద్ రనడే పగడిని ఈ శైలిలో తయారుచేసి ధరించడం ప్రారంభించారు.  లోకమాన్య తిలక్, జె.ఎస్. కరందికర్, డి.డి. సాత్యే, తాత్యాసాహెబ్ కేల్కర్, దత్తో వామన్ పోత్దార్ తదితర నాయకులు దీన్ని ధరించారు.[2]  1973లో  మరాఠీ నాటకం, ఘషిరామ్ కొత్వాల్ ప్రారంభమయ్యాకా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.[3]

వాడుక

[మార్చు]

పగిడి ఎక్కువగా వివాహం, పాఠశాల, కళాశాల్లో జరిగే సంప్రదాయ కార్యక్రమాలల్లో ఈ పగడి వాడుతూంటారు. గాంధాల్ కళన ప్రదర్శించే గోంధాల్ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు యువకులు కూడా దీన్ని వాడుతున్నారు. పగడి గౌరవ చిహ్నంగానేకాక సావనీరులో కూడా ఉపయోగపడుతుంది, గత కాలాన్ని సినిమా చిత్రకాలంగా స్వీకరించిన చారత్రిక చలన చిత్రాలు, థియేటర్లలో దీన్ని  ఉపయోగించడం కనిపిస్తుంది.[3]

References

[మార్చు]
  1. 1.0 1.1 "Indian association seeks IPR for 'Puneri Pagadi'". Business Standard. 7 April 2009. Retrieved 12 June 2012.
  2. 2.0 2.1 "Turban legend: Puneri Pagadi may soon get intellectual property tag". Mid-day. 6 April 2009. Retrieved 13 June 2012.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Shruti Nambiar (2 August 2011). "The Pagadi Unravelled". The Indian Express. pp. 1–2. Retrieved 13 June 2012.
  4. "Puneri Pagadi gets GI tag; latest to join protected goods club". Zee News. 21 September 2009. Retrieved 13 June 2012.
  5. "Puneri Pagdi obtains geographical indication status". OneIndia News. 3 January 2010. Archived from the original on 14 మే 2013. Retrieved 13 June 2012.
  6. Chandran Iyer (22 September 2009). "Puneri Pagadi gets pride of place". Mid Day. Retrieved 13 June 2012.