పెండలము కుటుంబము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండలము కుటుంబము

ఇది యొక మిక్కిలి చిన్న కుటుంబము. దీనిలో నన్నియు గ్తుల్మములే. అవియు తీగెలు. దీనికి కాకర, పొట్ల గెలయందున్నట్లు నులి తీగెలు లేవు. ఆకులు ఒంటరి చేరిక లఘు పత్రములు. సమాంచలము. వీని ఈనెలు, సాధారణముగ నన్ని ఏక దళ బీజకపు మొక్కల ఆకులందున్నట్లుండక, తమలపాకులో వలె నున్నవి. పుష్పములు ఏక లింగములు. కొన్నిటిలో, ఏక లింగ పుష్పములు వేరు వేరు మొక్కల మీదనే యున్నవి. పుష్పములకు ఆరు తమ్మెలతో, రంగుగలిగిన పుష్పనిచోళము గలదు. అండాశయము నీచము. మూడుగదులున్నవి.

పెండలమును పెద్ద దుంపల ముక్కలను గోసి వానిని బాతి పైరు చేయుటయే వాడుకయై ఉంది. దుంపలూరుటకు నేల గట్టిగా నుండ రాదు. అందులకు కొంచెమిసుక నేలలు మంచివి. పొలమును లోతుగ ద్రవ్వి నిండ యెరువువేసి దున్నుదురు. తరువాత మూడు నాలుగు అడుగుల వెడల్పున పొలము పొడుగున మళ్ళు గట్టి మళ్ళోఅగట్లు మీద అడుగున్నర దూరమున ఈ ముక్కలను పాతుదురు. కొన్నిచోట్ల దుంప ముక్కలను మొదటనే పొలములో పాతక చిన్న మొక్కలుగ నెదుగు వరకు వేరే మడులలో పెంచు చున్నారెఉ. తీగెలు ప్రాకుటకు ప్రతి దాని వద్ద నొక గడ కర్రను పాతవలయును. అట్టి పాతిన గెడ కర్రలను నాలుగైదు గలిసి వాని చివర నొక కట్టు కట్టు చున్నారు. కొన్ని చోట్లలో గెడ కర్రలకు బదులుగా చెట్లనే పెంచు చున్నారు. కొన్ని చోట్లనేమియు పాత దీగెను భూమి మీదనే ప్రాకనిచ్చు చున్నారు. దుంపలు బాగుగ నేడెనిమిది నెలలకు ఊరును. నేలను బట్టియు, రకమును బట్టియు ఎకరమునకు అరువది మణుగుల మొదలు రెండు వందల మణుగుల వరకు వచ్చును. బంగాళ దుంపల కంటే నివియే బలమగు నాహార పదార్థము. అవతంగ తీగె మెట్ట నేలలందు మొలచు చున్నది. ఇదియు దుంపలు బారును.

మూలము[మార్చు]

https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/455&action=edit[permanent dead link]