పెండింగ్ ఫైల్ (నాటిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండింగ్ ఫైల్ (నాటిక)
పెండింగ్ ఫైల్ (నాటిక) ముఖాచిత్రం
కృతికర్త: కొర్రపాటి గంగాధరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నలల
ప్రచురణ: అరుణ పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ
విడుదల: సెప్టెంబర్ 1979


కొర్రపాటి గంగాధరరావు రచించిన నాటకం పెండింగ్ ఫైల్. ఈ నాటకం అత్యంత ప్రజాధరణ పొందినది.

నాటక చరిత్ర[మార్చు]

బాపట్ల ఎన్.జి.ఓ. అసోసియేషన్ వారు కోరగా రచయిత నాటకం వ్రాయడం జరిగింది. లంచగొండితనం సమస్యగా ఇతివృత్తాన్ని తీసుకొని రాసారు. ఈ నాటకం ద్వారా ఇచ్చేవాడిది తప్పా పుచ్చుకొనేవాడిది తప్పా అనేది చర్చించి సమాధానం ఇచ్చాడు.

పాత్రలు[మార్చు]

  • భద్రయ్య - ఆఫీసు ప్యూను
  • సోమప్ప - పల్లెటూరి రైతు
  • శ్యామల రావు - జూనియర్ క్లర్క
  • రామదాసు - సీనియర్ క్లర్క
  • ఆఫీసర్ - ఏదీ తనకు పట్టనట్టుండే అధికారి
  • వెంకట్రామయ్య - ధనవంతుడైన రాజకీయనాయకుడు

నాటకాన్ని బాపట్ల ఎన్.జి.ఓలు మొదటగా ప్రదర్శించారు. తదనంతరం హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రదర్శించారు.

హక్కులు[మార్చు]

ఈ నాటకంపై అన్ని హక్కులు రచయిత కలిగి ఉన్నాడు. ఆయన అనుమతి తీసుకొని ప్రదర్శించుటకు రచయిత అంగీకరిస్తున్నారు.