Jump to content

పెంతుకోస్తు

వికీపీడియా నుండి

పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు. అయితే క్రోత్త నిభందన ప్రకారముగా యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు (ఈస్టర్), ఇజ్రాయేలియులు ధర్మశాస్త్రం అంధుకున్న రోజు ఒకేరొజు వస్తాయి. అధేవిధంగా యేసు క్రీస్తు పునరుధ్ధానుడైన తరువాత 40 రోజులు భూమిపైనే ఉండి పరలోకమును గురించి శిష్యులకు చెప్పుచు ఉండి తరువాత ఆరోహనమైన గురువారం నిండి పది రోజులకు ఈ పెంతుకోస్తు పండుగ వస్తుంది. అపోస్తుల కార్యములు 2: 1-31 ప్రకారం పరిశుధ్ధాత్మ శక్తి తన శిష్యులైన మిగిలిన 11 మంది మీదను మిగిలిన 59 మందిమీదను అగ్నివలే దిగివచ్చి వారు పరిశుధ్ధాత్మ పూర్నులగుటను గుర్తుచేసుకొనుటకు పెంతుకోస్తుపండుగను జరుపుకోవటం జరుగుతుంది.