Jump to content

పెట్టె కెమెరా

వికీపీడియా నుండి
మొట్టమొదటి పెట్టె కెమెరా - కొడాక్ (బ్రౌనీ) నెంబరు 1

పెట్టె కెమెరా (ఆంగ్లం: Box camera) ఒక ప్లాస్టిక్ పెట్టెకు ఒక వైపున కటకం, మరొకవైపు న ఫిలిం గల కెమెరా.[1] 19వ శతాబ్దం ప్రారంభంలో పెట్టె కెమెరాలు ఫోటోగ్రఫీ రాజ్యాన్ని ఏలాయి. మొదటి తరం పెట్టె కెమెరాలలో సూక్ష్మరంధ్రం, షట్టరు వేగం, ఫ్ల్యాష్ బల్బు వంటి వాటికి అమరికలు లేకున్ననూ తర్వాతి తరం పెట్టె కెమెరాలలో ఈ అమరికలు పొందుపరచబడ్డాయి. 1900 నుండి 1950 వరకు వీటి హవా నడిచింది. 1970 తర్వాత ఈ రకం కెమెరాలు కనుమరుగయ్యాయి.

పుట్టుక

[మార్చు]
1890లో కొడాక్ రూపొందించిన కొడాక్ 2 కెమెరాతో జార్జి ఈస్ట్‌మన్‌. మొదటి తరం బాక్స్ కెమెరాలు వృత్తాకారంలో ఛాయాచిత్రాన్ని చూపేవి.

తాము రూపొందించిన ఫార్మాట్ లో ఫిలిం చుట్ట అమ్ముడుపోవటానికి ఈస్ట్‌మన్‌ కొడాక్‌, కొడాక్ నెం. 1 (బ్రౌనీ 1) అనే కెమెరాను నిర్మించింది. నిపుణులు కాని, ఫోటోగ్రఫీ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని వాడకం లో సౌలభ్యం కొరకు ఈ కెమెరా తయారు చేయబడింది. అప్పట్లో ఉన్న కెమెరాల వలె మడతపెట్టటం/విప్పటం వంటివి లేకుండా, అమరికలలో ఎటువంటి మార్పులు చేయనవసరం లేకుండా సరళంగా దీని నిర్మాణం చేయబడింది. 1901 లో విడుదలైన కొడాక్ నెం. 2 (బ్రౌనీ 2) విషయంలో ఈ లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపించేవి.

నెం. 1 లో వృత్తాకారంలో ఛాయాచిత్రం చిత్రీకరించబడేది. నెం. 2 లో మాత్రం రెండుంపావు ఇంచిల వెడల్పు, మూడుంపావు ఇంచిల పొడవు గల దీర్ఘ చతురస్రాకారంలో ఛాయాచిత్రం చిత్రీకరించబడేది. "You just have to press and we'll do the rest" అని కొడాక్ తమ వాణిజ్య ప్రకటనలతో ఫోటోగ్రఫీని ప్రజలకు దగ్గర చేసింది. కెమెరాలో ఫిలిం లోడ్ చేయబడి ఉండేది. ఫిలిం అవ్వగానే ఫోటోగ్రఫర్ కు కెమెరా ఇస్తే ఫోటోగ్రఫర్ దానిని అన్ లోడ్ చేసి, ఫిలిం సంవర్థన చేసి, కెమెరా లో మరల క్రొత్త ఫిలిం చుట్టను లోడ్ చేసి తిరిగి వినియోగదారునికి ఇచ్చేవారు.

నిర్మాణం

[మార్చు]

పెట్టె కెమెరా లోహంతో పెట్టె ఆకారంలో చేయబడ్డ ఒక కెమెరా. దీనికి అమర్చే కటకం వక్రతలం (meniscus), ఫిక్స్డ్ ఫోకస్ కలిగి ఉంటుంది. దీని కుడి ప్రక్కన ఫిలిం ను ముందుకు త్రిప్పటానికి ఒక పిడి ఉంటుంది. కెమెరాకు వెనుకవైపు ఫ్రేం కౌంటర్ ఉంటుంది.

చిత్రీకరణ

[మార్చు]

అమరికలు ఎక్కువగా లేకపోవటంతో ఇది నిపుణులైన ఫోటోగ్రఫర్ల కోసం కాదు. రోజువారీ సన్నివేశాలను చిత్రీకరించటానికి మాత్రమే. ఇలా ఫోటోగ్రఫీ లోని అంశాలు తెలియకుండా కేవలం ఉన్నది ఉన్నట్లు తీసే ఫోటోలను స్నాప్ షాట్స్ అని వ్యవహరించటం అప్పటి నుండే మొదలు అయ్యింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "బాక్స్ కెమెరాల గురించి లోమోగ్రఫీ". Archived from the original on 2016-04-07. Retrieved 2018-11-01.