Jump to content

పెద్దపాడు (ధరూర్)

వికీపీడియా నుండి

పెద్దపాడు మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలానికి చెందిన గ్రామం. గద్వాల నుండి జూరాల ప్రాజెక్టుకు వెళ్ళే దారిలో ఇది రెండవ గ్రామం

ప్రాథమిక పాఠశాల, పెద్దపాడు
పెద్దపాడు

పెద్దపాడు, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, ధరూర్ మండలంలోని ఒక చిన్న గ్రామం/కుగ్రామం. ఇది చింతరేవుల పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ మహబూబ్ నగర్ నుండి దక్షిణం వైపు 67 కిమీ దూరంలో ఉంది. ధరూర్ నుండి 9 కి.మీ. దూరంలో ఉంది.

పెద్దపాడు చుట్టూ తూర్పున ఆత్మకూర్ మండలం, తూర్పున గద్వాల్ మండలం, ఉత్తరాన నర్వ మండలం, ఉత్తరాన చిన్నచింతకుంట మండలం ఉన్నాయి.

గద్వాల్, రాయచూర్, వనపర్తి, నారాయణపేట పట్టణాలు పెద్దపాడుకు సమీపంలో ఉన్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. "Peddapad Village". www.onefivenine.com. Retrieved 2025-10-15.