పెన్సిల్ షార్పనర్
పెన్సిల్ షార్పనర్ లేదా షార్పనర్ అనేది పెన్సిల్ కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.
చరిత్ర
[మార్చు]పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు.[1] మొదటి అమెరికన్ పెన్సిల్ షార్పనర్ 1855లో వాల్టర్.కే ఫోస్టర్ చే పేటెంట్ చేయబడింది.[2] కార్యాలయాల కోసం ఎలక్ట్రిక్ పెన్సిల్ షార్పనర్లు కనీసం 1917 నుంచి ఉపయోగించబడుతున్నాయి. పెన్సిల్ షార్పనర్లతో పెన్సిళ్లను చెక్కడం సులభమవడంతో అందరూ ఈ పరికరాన్ని ఉపయోగించసాగారు.
మూలాలు
[మార్చు]- ↑ "20 Things You Didn't Know About... Pencils", Discover magazine, May 2007, archived from the original on 2009-04-21, retrieved 2009-04-30
- ↑ "Handheld Pencil Sharpeners". Archived from the original on 18 జూలై 2011. Retrieved 9 July 2011.