పెప్పర్ స్ప్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెప్పర్ స్ప్రే ' లేదా మిరియాల పిచికారి మిరియాలు తో తయారు చేయబడిన ఒక ఘాటైన పిచికారి మందు. దీనిని ఎక్కువగా ఆత్మరక్షణ కోసం వినియోగిస్తారు.

ప్రభావము[మార్చు]

పెప్పర్ స్ప్రే ప్రాణాంతకమైంది కాదు. దీన్ని పిచికారి చేయగానే వెంటనే కళ్లు మండుతాయి. కొద్ది సేపటి వరకూ కళ్లు తెరవలేము. శ్వాస ఇబ్బంది అవుతుంది. దాని ఘాటుకు తుమ్ములొస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది. స్ప్రే ఎంత దగ్గర నుంచి ఎంత మోతాదులో వాడతామనే దానిపై ప్రభావం ఆధార పడి ఉంటుంది. దీని పూర్తి ప్రభావం తగ్గడానికి ఆరగంట నుంచి గంట వరకూ సమయం పడుతుంది. ఒకసారి పిచికారి చేయడం వల్ల కళ్లకు ఎటువంటి హాని ఉండదు. ఉబ్బసం ఉన్న రోగులకు మాత్రమే కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. ఈ పెప్పర్ స్ప్రే చేతిలో ఇమిడిపోయే సీసాలతో విపణిలో అందుబాటులో ఉంది. మహిళలు ఆకతాయిల నుంచి అత్మరక్షణ కోసం వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

పెప్పర్ స్ప్రే ని ఎలా ఉపయోగించాలో తెలిపే ప్రదర్శన
పెప్పర్ స్ప్రే ని ఎదుర్కొన్న తర్వాత ఎలా ఉపశమనం పొందాలో శిక్షణ పొందుతున్న అమెరికాసైన్యం.

వార్తలలో పెప్పర్ స్ప్రే[మార్చు]

2014 : భారత పార్లమెంటు[మార్చు]

2014 ఫిబ్రవరి 13 గురువారం విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలకలం రేపారు. సభలో మిరియాల పొడి స్ప్రే చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో అయోమయం నెలకొంది. మంటలు వస్తాయనే భయంతో సభ్యులు బయటకు పరుగులు తీశారు. కళ్లలోంచి నీళ్లు, దగ్గు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. అక్కడితో ఆగకుండా కంప్యూటర్ ను లగడపాటి ధ్వంసం చేశారు. పెప్పర్ స్ప్రే తో ఇబ్బందులకు గురైన ఎంపీలను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటిని అదుపులోనికి తీసుకున్నారు.[1][2]. సంబంధిత వార్తా వీడియో ను ఇక్కడ చూడవచ్చును.

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/news/national/vijayawada-mp-uses-pepper-spray-in-lok-sabha/article5684327.ece
  2. http://in.news.yahoo.com/mp-uses-pepper-spray-in-lok-sabha-to-protest-telangana-072112485.html

బయటి లంకెలు[మార్చు]