పెరిక క్షత్రియులు
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పెరిక అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కనిపించే ఒక కులము. ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 15 వ కులం. ఇది క్షత్రియ ఉప కులమని చెప్పవచ్చు. వృత్తిరీత్యా వీరు వ్యవసాయదారులు, భూస్వాములు. సంస్కృతంలో వ్యాపారక్ అను పదమునుండి పెరిక అను పదము వచ్చినదని పలువురి అభిప్రాయం. వీరిలో ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పెఱిక భవన్‌లో ఈ కులస్థులకు వసతి కల్పించి విద్యావంతులను చేస్తున్నారు. పెఱిక వారిది వ్యవసాయ వృత్తి. వ్యాపార వస్తువులను సంచుల్లో నింపి ఎడ్ల వీపుపైన అటొక సంచి, ఇటొక సంచి వేసి అలా వందల ఎడ్లను అదిలించుకుంటూ వందల మైళ్ళ దూరాలలో ఉన్న వ్యాపార కేంద్రాలకు చేరవేసే వారిని పెరికపూత్తువారు అనేవారు. ‘పెరిక’ అంటే ఎడ్ల వీపుపై రెండు వైపులా వేలాడదీసిన రెండు వస్తువుల సంచుల ప్రమాణం. పెరికపూత్తు వారు గుర్రాలు, ఎడ్ల బండ్లపైన కూడా సరుకులను వ్యాపార కేంద్రాలకు చేరవేసేవారు.
కుల చరిత్ర[మార్చు]
చరిత్రలో అసలు సిసలు వ్యాపారులు, నేడు బలహీన వర్గాలుగా ఎక్కడో ఒక మూలనున్న పెరికలే - సురవరం ప్రతాప రెడ్డి. వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపార లావాదేవీలు సాగే కాలంలో వ్యాపారులు తమ సరుకులను గోనె సంచులలో వేసి వాటిని ఎడ్లు, గుర్రాలు లాంటి జంతువులపై తరలించేవారు. ఇలా ఆ జంతువులకు అటు- ఇటూ తగిలించే గోనె సంచుల జతను పెరికలు అని అనే వారు. ఇలా వ్యాపారం చేసే వర్తకులకు పెరికలు అనే పేరు స్థిరపడి పోయింది. ఆ వర్తకుల సమూహమే ' పెరిక' కులంగా పరివర్తన చెందింది. కావునే, ఎద్దులపై పెరికల ద్వారా ఉప్పు, ధాన్యాలను తీసుకెళ్లేవారే పెరిక కులస్తుఅని 1891, 1901 నాటి జనాభా లెక్కలలో కూడా పేర్కొనడం జరిగింది. 12వ శతాబ్ధిలో దేశం లోపల వ్యాపారం బళ్లమీద, జంతువుల వీపునా జరిగేది. మధ్యన తెరచి ఉండే పెద్ద పెద్ద సంచులతో రెండు వేపులా సరుకు నింపి మధ్య భాగం జంతు వీపున మోసేలా వేస్తారు. ఈ సంచులను పెరికలంటారు. వివిధ వస్తువులతో నింపిన పెరికల ప్రసక్తి కాకతీయ శాసనాలలో కనిపిస్తుంది. పెరికలను ఉపయోగించి వ్యాపారం చేసేవారు కాలక్రమంలో ఒక సముదాయంగా ఏర్పడ్డారు. చివరకు అంతర్వివాహాలను మాత్రమే పాటిస్తూ పెరికలనే ప్రత్యేక కులంగా, చతుర్థ కులంలో ఒకరుగా పరిణతి చెందారు అని పేర్కొన్నారు మార్క్సిస్టు చరిత్రకారులు కంభంపాటి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రంలో పెరికలను పెరికలు, పెరిక అయ్యవార్లు, పటేండ్లు, సావుకార్లు అని వ్యవహరిస్తారు.1953వ సంవత్సరంలోనే పెరికకుల పెద్దలందరూ కలిసి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాహి ప్రాంతంలో పెరిక హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. (నవతెలంగాణ 29.2.2016)
కులపోరాటం[మార్చు]
ఫుర్వకాలంలో పెఱికల మీద సరకులు రవాణా చేసి అదే ముఖ్యవృత్తిగా జీవించే తెగలవారికి క్రమేణా "పెఱిక" అన్న పేరు కులనామంగా స్థిరపడింది. ఆది యుగాలలో క్షత్రియజాతికి చెందిన వీరు పరశురాముని ధాటికి ఎదురు నిలిచి యుద్ధంచేసే శక్తిలేక శివుని ప్రార్థించినట్లు, ఆయన ఆజ్ఞానుసారం ఎడ్లపై పెఱికలను వేసుకొని వాటితో వ్యాపారం సాగించారని పురాణాల పరంగా తెలుస్తోంది. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ పెఱిక వారిది వ్యవసాయ వృత్తి. బిసిలలోని అన్ని వర్గాల వారికి కులవృత్తులు ఉన్నాయని, ఏదో ఒక రూపంగా ప్రభుత్వం నుంచి వారికి సహాయం అందుతుందని, కానీ ఒక్క పెరిక కులస్థులు మాత్రం తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని సాగు చేస్తున్నారని వారికి ఎలాంటి సంక్షేమాల్ని ఈ ప్రభుత్వం అందించడం లేదని పెరిక సంఘం రాష్ట్ర నాయకులు కర్రె లచ్చన్న పిలుపునిచ్చారు.[1] తురకలసేద్యం పెరికలపాలు అని సామెత ఉంది[2].
పురాణం[మార్చు]
Perika (puragiri kshathriya)
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. పెరిక క్షత్రియులు:- మహాభారతం ప్రకారం, బ్రాహ్మణుడైన పరశురాముడు ఆగ్రహంతో క్షత్రియ జాతిని సర్వ నాశనం చేసే కార్యక్రమం చేపట్టాడు. ఆ సమయంలో కొద్ది మంది క్షత్రియులు వ్యాపారస్తులమని చావు నుండి తప్పించుకొన్నారు. అయితే వీరు పిరికి వారు, అబద్దాలాడేవారూ కాదు. కొద్ది మంది క్షత్రియులు తమ పదవుల నుండి విరమణ పొందిన తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పరచుకొన్నారని, కాల క్రమేణా వారు పురగిరి క్షత్రియులుగా (పూర్వము గిరులలో నివసించిన క్షత్రియులు). పురగిరి క్షత్రియుల పేర్ల చివర అన్న, అయ్య, రావు, రాయ, రాయుడు, వర్మ, రాజు లు అని ఉంటాయి.
(గుంపుల వినయ్)
vinnu
గ్రంధాలు[మార్చు]
- చరిత్రవాహినిలో పెరిక కులం
Perika(puragiri kshathriya)
లంకెలు[మార్చు]
- http://en.wikipedia.org/wiki/Perike
- http://www.navatelangana.com/article/saamaajika-nyaayam/236374[permanent dead link]
మూలాలు[మార్చు]
- ↑ http://www.suryaa.com/local-news/article-1-126699[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-12. Retrieved 2014-01-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-27. Retrieved 2014-01-13.