Jump to content

పెరికిముగ్గుల

వికీపీడియా నుండి
(పెరికముగ్గుల నుండి దారిమార్పు చెందింది)

పరికిముగ్గెరుకుల(సోదేరుకుల) : ఈ కులం వారిని పరదేశీయులని వలస దారులని, చెట్టు సమ్మె కులాలని, ఎరుకుల కులంలో సోదేరుకుల అంటారు. బ్రిటిష్ పరిపాలనలో జరిగిన సంఘటనల ప్రకారం ఇప్పటి పరిస్థితిని బట్టి ఎరుకుల కులంలో కొన్ని ఉపకులాలు సువ్వేరుకుల, బద్దేరుకుల,సోదేరుకుల (పరికముగ్గుల అని పిలువబడే), కుంచెరుకుల,ఉప్పెరుకుల, సెటిల్మెంట్ ఎరుకుల, కరివేపాకేరుకుల అనే ఉపకులాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సోదేరుకుల వాళ్ళు ఎరుకల కులంలో అన్ని ఉపకులాలవారితో వివాహ సంబంధాలున్నాయి. వీరికి మూఢనమ్మకాలు ఎక్కువ .పెదకాకాని మండలం వెనిగండ్ల చుట్టుపక్కల ఈ కులస్తులు ఉన్నారు. నేరస్తులనే నింద పడిన వారు తాము నేరం చేయలేదని నిరూపించుకోవడానికి ఎర్రగా కాల్చిన పలుగును పట్టుకోవాలని కులపెద్దలు తీర్పునిస్తారు. కులపెద్దలతీర్పుకోసం అయ్యే కొత్త పలుగు, పిడకలు, వచ్చిన పెద్ద మనుషులు , బోజనాల ఖర్చు నిందితుడే భరించాలి. పాసీ కులస్తులతో ఈకులానికి అనేక విషయాలలో సారూప్యత ఉంది.

వీళ్లకి ప్రత్యేకమైన బాష ఉంటుంది.వీరి భాష తమిళ్ భాష కి దగ్గరగా ఉంటుంది.వీళ్ళు చాల తెలివిగా ఉంటారు. వీళ్ళలో శీలం,దాసరి, మద్దెల, మేడ, సజ్జ, తుమ్మల, కట్ట, కుంభ, సొగల, డేగల,లాంటి ఇంటిపేర్లుంటాయి..వీళ్లలో ఐకమత్యం ఎక్కువ గా ఉంటుంది. వీళ్లకి వీళ్లు చట్టబద్దం గా వ్యవహరించకుండా వీళ్లే కూర్చోని సమస్య వస్తే మాట్లాడుకుంటారు..వీళ్ళలో ఎక్కువ మంది శివుడిని, వెంకటేశ్వర్లు ని పూజిస్తారు..పూర్వాచారం బాగా నమ్ముతారు. అందరికి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు.వీళ్ల లో ఆడవాళ్లు ఎరుక (సోది ) చెప్తారు..వీళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.చదువుకున్న వాళ్లకి విలువ ఇవ్వడంలో వీళ్లకి సాటి ఉండరు..ప్రస్తుతం వీళ్లు వెనిగండ్ల గ్రామంలో సత్తెన పల్లి, అచ్చం పేట, నాగలంక, కొలకలూరు, నరసరావుపేట, బాపట్ల, యడ్లపాడు,విజయవాడ,కృష్ణలంక,ఇబ్రహీం పట్నం, చేబ్రోలు, నందిగాం, తుళ్లూరు,అనేక గ్రామాల్లో ఉన్నారు అని సమాచారం..వీళ్లలో మనిషి చనిపోతే పుడ్చి పెడతారు.అన్నీ విద్య లు తెలిసిన వాళ్ళుగ గుర్తుపు పొందారు. వీళ్ళలో మాట మీద కట్టు బడి ఉంటారు మహాభారతంలో ధర్మరాజు మాట తప్పిన ఈ కులం వారు మాట తప్పరు అంతా విలువ ఉంటది మాటకి ,వీళ్ళ గురించి ఇంకా ఉంది చెప్పడానికి,నమ్మిన ఆడ మనిషికి కట్టె కాలే వరకు తోడు ఉండే మనుషులు ఉన్నారు వీళ్ళలో ఇంకా !వీళ్లలో వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు.డబ్బు వడ్డీలకి ఇస్తూ ఉంటారు అని సమాచారం. కాలం మారే కొద్దీ వీళ్ళు మండపాలు, చిక్కెంట్రకులు కొనడం, కిరాణా స్టోర్స్ పెట్టడం, చేపల చెరువులు వేయడం వంటి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతున్నారు.

మూలాలు

[మార్చు]