Jump to content

పెరికిముగ్గుల

వికీపీడియా నుండి

పెరికిముగ్గుల : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి.సి.ఏ గ్రూపులో 31వ కులం[1]. వీరిని పరదేశీ లని కూడా అంటారు. ఎరుకల బుడగజంగాలుతో వివాహ సంబంధాలున్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ .పెదకాకాని మండలం వెనిగండ్ల చుట్టుపక్కల ఈ కులస్తులు ఉన్నారు. నేరస్తులనే నింద పడిన వారు తాము నేరం చేయలేదని నిరూపించుకోవటానికి ఎర్రగా కాల్చిన పలుగును పట్టుకోవాలని కులపెద్దలు తీర్పునిస్తారు. కులపెద్దలతీర్పుకోసం అయ్యే కొత్త పలుగు, పిడకలు, సారాయి బోజనాల ఖర్చు నిందితుడే భరించాలి. పాసీ కులస్తులతో ఈకులానికి అనేక విషయాలలో సారూప్యత ఉంది.

పరికి ముగ్గుల, లేదా పెర్కా, వారి పూర్వీకులు చేతబడిలో నిపుణులని నమ్ముతారు. ఒక వ్యక్తిపై దుష్ట ఆత్మల యొక్క హానికరమైన ప్రభావాలను అధిగమించడానికి వారు ఒక నిర్దిష్ట కర్మను నిర్వహిస్తారు. ఈ ఆచారాన్ని నిర్వహించడానికి ముందు, వారు ముగ్గురాయి (ఒక ఖనిజం) తో నేలపై దుష్ట, ప్రాణాంతక ఆత్మల నమూనాలను గీస్తారు. ఆ విధంగా వీరికి పరికి ముగ్గుల అనే పేరు వచ్చింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "List of B.C castes and their population in AP( According to Govt) Ours is 17% and third largest caste in AP". groups.google.com. Retrieved 2023-04-19.
  2. Project, Joshua. "Perka in India". joshuaproject.net (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.