పెర్టుస్సిస్ టీకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెర్టుస్సిస్ టీకా

పెర్టుస్సిస్ వ్యాక్సిన్ అనేది ఒక టీకా, ఇది కోరింత దగ్గు నుండి కాపాడుతుంది.[1] ప్రధానంగా దీనిలో రెండు రకాలు ఉన్నాయి: హోల్-సెల్ టీకాలు, ఎసెల్యులర్ టీకాలు.[1] హోల్-సెల్ టీకా 78% ప్రభావవంతంగా ఉంటుంది, అయితే ఎసిల్లార్ టీకా 71–85% వరకు ప్రభావవంతంగా ఉంటుంది.[1][2] టీకాల ప్రభావం సంవత్సరానికి 2 నుండి 10% వరకు తగ్గుతుంది, ఎసిల్లార్ వ్యాక్సిన్లతో మరింత వేగంగా తగ్గినట్లు కనిపిస్తుంది.[1] గర్భధారణ సమయంలో టీకా వేయడం వల్ల శిశువును కాపాడవచ్చు. 2002 లో ఈ టీకా ఐదు లక్షలకు పైగా ప్రాణాలను కాపాడినట్లు అంచనా వేయబడింది.[3]

ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కోరింత దగ్గు కోసం పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలని, దీనిని సాధారణ టీకాలలో చేర్చాలని సిఫార్సు చేస్తున్నాయి.[1][4] వీరిలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ గలవారు ఉన్నారు. ఆరు వారాల వయస్సులో ప్రారంభమయ్యే మూడు మోతాదులను సాధారణంగా చిన్న పిల్లలకు సిఫార్సు చేసారు. పెద్దపిల్లలకు, పెద్దలకు అదనపు మోతాదును ఇవ్వవచ్చు. ఈ టీకా ఇతర టీకాలతో కలిపి మాత్రమే లభిస్తుంది.[1]

తక్కువ దుష్ప్రభావాల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఎసెల్యులార్ టీకాలు ఎక్కువగా ఉపయోగించబడతాయి. హోల్ సెల్ టీకాలు ఇచ్చిన 10 నుండి 50% మందిలో ఇంజక్షన్ చేసిన ప్రాంతం వద్ద ఎర్రబడుతుంది, జ్వరం వస్తుంది. ఒక శాతం కన్నా తక్కువ వారిలో ఫెబ్‌రైల్ మూర్ఛలు, ఎక్కువ సేపు ఏడవటం సంభవిస్తాయి. ఎసెల్యులార్ వ్యాక్సిన్లతో తక్కువ సమయం చేతికి తీవ్రంగా లేని వాపు రావచ్చు. రెండు రకాల టీకాలతో దుష్ప్రభావాలు, కానీ ముఖ్యంగా హోల్-సెల్ టీకా విషయంలో, వయస్సు ఎంత తక్కువ ఉంటే దుష్ప్రబావాలు అంత తక్కువగా ఉంటాయి. హోల్ సెల్ టీకాలు ఆరు సంవత్సరాల వయస్సు తరువాత వాడకూడదు. తీవ్రమైన దీర్ఘకాలిక నరాల సమస్యలు ఏ రకమైన టీకాతోను సంబంధాన్ని కలిగి ఉండవు.[1]

పెర్టుస్సిస్  టీకా 1926 లో అభివృద్ధి చేయబడింది.[5] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన చాలా అతి ముఖ్యమైన మందు.[6] ధనుర్వాతం, డిఫ్తీరియా, పోలియో, హిబ్ వ్యాక్సిన్‌లను కలిగి ఉన్న ఒక వెర్షన్ 2014 నాటికి ఒక మోతాదుకు 15.41 అమెరికా డాలర్ల ఖర్చు అయింది.[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Pertussis vaccines: WHO position paper - September 2015" (PDF). Wkly Epidemiol Rec. 90 (35): 433-58. 2015 Aug. PMID 26320265.
  2. Zhang, L; Prietsch, SO; Axelsson, I; Halperin, SA (Sep 17, 2014). "Acellular vaccines for preventing whooping cough in children". The Cochrane Database of Systematic Reviews. 9: CD001478. doi:10.1002/14651858.CD001478.pub6. PMID 25228233.
  3. "Annex 6 whole cell pertussis" (PDF). World Health Organization. Retrieved 5 June 2011.
  4. "Pertussis: Summary of Vaccine Recommendations". Centre for Disease Control and Prevention. Retrieved 12 Dec 2015.
  5. Macera, Caroline (2012). Introduction to Epidemiology: Distribution and Determinants of Disease. Nelson Education. p. 251. ISBN 9781285687148.
  6. "WHO Model List of EssentialMedicines" (PDF). World Health Organization. October 2013. Retrieved 22 April 2014.
  7. "Vaccine, Pentavalent[permanent dead link]". International Drug Price Indicator Guide. Retrieved 8 December 2015.