పెళ్లి రిసెప్షన్
పెళ్లి రిసెప్సన్ అనేది పెళ్ళి పూర్తయిన తరువాత బంధు మిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం.
బంధు మిత్రుల మధ్య జరుపు కోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో వారి మధ్య జరగ పోతే ప్రత్యేకంగా ఈ పెళ్ళి రిసెప్సన్ ను ఏర్పాటు చేస్తారు.
ఈ పెళ్ళి రిసెప్సన్ కు బంధు మిత్రులను ఆహ్వానించడమే కాకుండా వారికి విందును ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమంలో నూతన దంపతులు ప్రత్యేక కుర్చీలలో (సింహాసనం) అందరికి కనపడే విధంగా ఆశీనులై ఉంటారు.
ఈ పెళ్ళి రిసెప్సన్ ప్రాంగణాన్ని పెళ్ళికి అలంకరించినట్టే అలంకరిస్తారు.
కొంతమంది బంధు మిత్రులు నూతన దంపతులకు ఈ కార్యక్రమంలో బహుమతులను అందజేస్తారు.
పెళ్లి రిసెప్సన్ వేడుక సమయంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు.
ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా సాయంత్రం లేదా రాత్రి పూట ఏర్పాటు చేస్తుంటారు.
కొన్ని చోట్ల నూతన దంపతుల చేత కేకును కట్ చేయిస్తారు.
ఆర్ధిక భారం
[మార్చు]ఈ కార్యక్రమానికి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి ధనికులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.