పైగంబర కవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సాహితీజగత్తును దిగంబర కవులు ఒక కుదుపుకుదిపిన రోజుల్లో ఆ స్ఫూర్తితో గుంటూరు నుండి పైగంబర కవులు అవతరించారు. దేవీప్రియ, సుగమ్‌బాబు, కిరణ్‌బాబు, ఓల్గా, కమలాకాంత్‌ ఈ బృందంలోని సభ్యులు. తెలుగు సాహిత్యంలో నెలకొన్న స్తబ్ధతను బద్దలుకొట్టింది పైగంబర కవిత్వం. జ్వాల పత్రిక ద్వారా తమ కవిత్వాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిజానికి దిగంబర కవులకు, పైగంబర కవులకు వస్తువు విషయంలో భేదాభిప్రాయం లేదు. అందరూ అభ్యుదయవాదులే. కేవలం అభివ్యక్తి విషయంలోనే అభ్యంతరం..[1]

సిద్ధాంత రాహిత్యం, బూతుల ప్రయోగాల వల్ల దిగంబర కవిత్వం తన లక్ష్యానికి సమీప దూరంలో ఆగిపోయింది. దిగంబరకవిత్వంతో సంబంధం లేకుండా మనిషిని అజెండా   చేసుకొని, మానవత్వాన్ని తట్టి లేపుతూ సామాజిక చేతన ప్రధాన లక్ష్యంగా పైగంబర కవిత్వాన్ని తెరపైకి తెచ్చారు.

సుగం బాబు 1970లో దేవిప్రియ,కిరణ్ బాబు,ఓల్గా,కమలాకాంత్ లతో కలిసి పైగంబర కవితోద్యమానికి శ్రీకారం చుట్టాడు. పైగంబర కవిత్వం ఉద్యమ రూపం సంతరించుకునే సమయంలోనే విరసం ఆవిర్భవించింది. పైగంబర కవుల్లో కిరణ్ బాబు ఓల్గా, సుగంబాబు విరసం లో చేరిపోయారు. ఆరకంగా ఉద్యమ స్థాయిలోనే పైగంబర కవిత్వం నిలిచిపోయింది. అయినప్పటికీ భాషలో, భావంలో, చేతనా పరంగా మంచి కవిత్వాన్నే అందించారు[2]. పైగంబర కవులు యుగసంగీతం, యుగచైతన్యం అనే రెండు కవితా సంకలనాలను వెలువరించారు.

మూలాలు

[మార్చు]
  1. యాకూబ్ (1 August 2017). "తెలుగు కవిత్వం- అవలోకనం". దక్కన్ లాండ్.
  2. "లాబీల మాయలో మన కవిత్వం: సుగమ్ బాబు – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2020-05-09.