పొన్నంకి పిట్ట
ఇండియన్ పిట్ట (పోనంకి పిట్ట) | |
---|---|
Indian pitta in Maharashtra, India
| |
Scientific classification | |
Unrecognized taxon (fix): | Pittoidea |
Family: | Pittidae |
Genus: | Pitta |
Species: | P. brachyura
|
Binomial name | |
Pitta brachyura (Linnaeus, 1766)
| |
Synonyms | |
Corvus brachyurus Linnaeus, 1766[2] |
పొన్నంకి పిట్ట లేదా ఇండియన్ పిట్ట (పిట్ట బ్రాచ్యురా) భారత ఉపఖండానికి చెందిన ఒక పాసెరైన్ (పక్షుల జాతులలో సగం కంటే ఎక్కువ గల పక్షుల సమూహం) పక్షి. ఇది స్క్రబ్ జంగిల్, ఆకురాల్చే, దట్టమైన సతత హరిత అడవులలో నివసిస్తుంది. ఇది హిమాలయాల అడవులు, మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొండలలో సంతానోత్పత్తి చేస్తుంది, శీతాకాలంలో ద్వీపకల్పంలోని ఇతర ప్రాంతాలకు వలసపోతుంది. చాలా రంగురంగుల అయినప్పటికీ, ఇది సాధారణంగా సిగ్గుపడుతున్నట్లు అటవిలో కీటకాలను ఎంచుకునేందుకు దిగువ భాగాన దాగి ఉంటుంది. ఇది తెల్లవారుజామున, సంధ్యా సమయంలో వినబడే విశిష్టమైన రెండు శబ్దాలను చేస్తుంది[3].
లక్షణాలు
[మార్చు]హిందీలో నవవ్ రంగ్ అంటారు. దీని దేహం కొట్టవచ్చినట్లు గాడీగా ఆకుపచ్చ, నీలం, మాసిన నలుపు ,తెలుపు, ముదురు రంగులతో ఉంటుంది. మయినా కింది భాగంలో పొట్టమీద పసుపు రంగు, తోకవద్దcrimson రంగు, రెక్కల చివర గుండ్రముగా తెల్లని చుక్క పిట్ట ఎగురుతున్నపుడు కనిపిస్తుంది. ఇది మయినా సైజులో ఉంటుంది. నవ్ రంగ్ పదాన్ని తెలుగులో కూడా కొందరు వాడుతారు. పిట్ట తెలుగు పదం, చిన్న పక్షి అని. ఈ పదంనుంచి ఈపిట్టకు ఈపేరు వచ్చింది, ఆకృతిలో చిన్న పక్షులను పిట్ట అని వ్యవహరించడం కద్దు. కానీ ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమయిన పక్షి. ఈ పక్షి భారత ఉపఖండం అంతటా కనిపిస్తుంది. గడ్డి, పొదలు పెరిగేచోట, హిమాలయ పర్వతాల్లోని దట్టమయిన సతత హరితారణ్యాలలోనూ సంచరిస్తాయి. ఇవి ఒక ప్రాంతానికి పరిమితమయి (teritorial) ఉంటాయి. ఇవి చాలా సిగ్గరి పిట్టలు. ఆకులమధ్య, కొమ్మలమధ్య ఉండి కనపడవు. ఆడ, మగ పిట్టల తలపయి భాగం crimson రంగులో ఉంటుంది. "stubby tail, పోరకకట్ట ఆకృతిలోని " తోకను నిరంతరం మెల్లగా పైకి, కిందికి కదిలిస్తూ ఉంటుందని పక్షిశాస్త్రగ్జులు వివరించారు. ఇది మనుషులకు మచ్చికవుతుంది. దీన్ని పంజరాల్లో పెట్టి సాకుతారట!
పిట్టలు తడినేలల్లో, మట్టిలో రకరకాల పురుగులు, కీటకాలను ఆహారంగా తింటాయి. ముక్కుతో నేలను చెరుగుతూ గడ్డి, కలుపుమొక్కలు, పొదలు పెరిగినచోట ఆహారం సేకరించుకొంటాయి. వేకువన, సంజవేళ ఇది మనోహరంగా పాడుతూ ఉంటుంది. 2023 ఏప్రిల్లో ఒరిస్సా తీరంలోని మడ ఆడవులలో ఈ అరుదైన పిట్టలు కనిపించాయయని, . ఇప్పుడు షుమారు 179పిట్టలు మాత్రమే భారత దేశంలో మిగిలినట్లు హిదూ పత్రిక రాసింది.
తమిళనాడులో కొన్నేళ్ళ క్రిందటి వరకూ ఈ పిట్టలను పట్టుకొని తినే అలవాటు ఉండేది.
ఇవి నేలమీద తిరిగే పక్షులు, రాత్రి వేళ చెట్ల కొమ్మలపయి విశ్రాంతిగా ఉంటాయి. కొనదేరిన గుడ్లను పెడతాయి. చెట్లపయన, నేలమీద, పొదల్లో గుమ్మటం ఆకృతిలో గూళ్ళు అల్లుతాయి. నాలుగు నుంచి ఆరు గుడ్లవరకు పెడతాయి. ఆడ, మగ పిట్టలు పొదిగే బాధ్యత తీసుకొంటాయి. 14-18 రోజుల్లో గుడ్లు పిగిలి పిల్లలవుతాయి. వానపాములు, నత్తలు, కీటకాలు, పురుగులు, మిడతలు వీటి ఆహారం.
వీటిలో 44 జాతుల పిట్టలున్నాయి, అందులో నాలుగు రకాలు పూర్తిగా వలస పక్షులు.
మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2016). "Pitta brachyura". IUCN Red List of Threatened Species. 2016: e.T22698681A93696932. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T22698681A93696932.en. Retrieved 19 November 2021.
- ↑ Dickinson, E. C.; Dekker, R. W. R. J.; Eck, S. & Somadikarta, S. (2000). "Systematic notes on Asian birds. 5. Types of the Pittidae". Zoologische Verhandelingen. 331: 101–119.
- ↑ Ali, S.; S. D. Ripley (1983). Handbook of the birds of India and Pakistan. Vol. 4 (2nd ed.). Oxford University Press. pp. 252–253.
ఆధారాలు
[మార్చు]- Common Birds, Salim Al & Laeeq Futehalliy, NATIONAL BOOKTRUST, INDIA, 1967.
- The Hindu, dated April 18th, 2023. News and phot of the Pitta was published.