పొన్నపల్లి మధుసూదన్
Jump to navigation
Jump to search
పొన్నపల్లి మధుసూదన్ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఛైర్మన్.గుంటూరు జిల్లా ఆరేపల్లి (చెరుకుపల్లి) గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, వీరమ్మల ఏడో సంతానం.ప్రాథమిక విద్య, డిగ్రీ రేపల్లె ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో జరిగాయి.1975-78లో ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ పొంది రాష్ట్రంలో 10వ ర్యాంకులో నిలిచారు. 1979-82 లో హైదరాబాద్‌లో సీఏ చేసి ఆల్ ఇండియా ర్యాంకరుగా నిలిచారు. 1983 లో భిలాయ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా చేరి 2007 వరకు కొనసాగారు.బెంగాల్‌లోని ఇస్కో స్టీల్‌లో పనిచేశారు. 2009 నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్, ఫైనాన్స్ బోర్డు సభ్యునిగా కొనసాగుతున్నారు. జనవరి, 2014 నుంచి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఛైర్మన్ పదవికి ఎంపికయ్యారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు రూరల్ 2013 సెప్టెంబరు 21. 3వ పేజీ.