పోఖారా
పోఖారా
पोखरा | |
---|---|
దేశం | Nepal |
Development Region | Western |
Zone | Gandaki Zone |
District | Kaski District |
Incorporated | 1962 |
విస్తీర్ణం | |
• Total | 55.22 కి.మీ2 (21.32 చ. మై) |
• Water | 4.4 కి.మీ2 (1.7 చ. మై) |
Highest elevation | 1,740 మీ (5,710 అ.) |
Lowest elevation | 827 మీ (2,713 అ.) |
జనాభా (2013) | |
• Total | 3,00,000 |
• జనసాంద్రత | 5,000/కి.మీ2 (10,000/చ. మై.) |
• Ethnicities | Khas (Brahmin Chhetri Thakuri & Dalits) Gurung Magar Newar Thakali |
• Religions | Hinduism Buddhism |
Time zone | GMT +5:45 |
Postal Code | 33700 (WRPD), 33702, 33704, 33706, 33708, 33713 |
ప్రాంతపు కోడ్ | +61 |
పోఖారా
నేపాల్ వెళ్లినవారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూ ద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్న పూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది పోఖారా. ఇక్కడి మత్స్యపుత్స పర్వతం చూడ టం ఒక వింతైన అనుభవం. చేపతోక రూ పం లో ఆ శిఖరాలు కనిపిస్తాయి.
సూర్యోదయం
[మార్చు]కువ ఝామునే లేచి సూర్యోదయ కిరణాల వెలు గులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకిం చడం జీవితంలో మరువలేని అను భవం. సూర్యుని తొలికిరణాలకు వెలుగులు ప్రారంభించి, సమయంతో పెరిగే సూర్య కిరణాలకు తగిన రీతిలో వెలుగులను విరజిమ్మే ఆ శిఖరాలను దర్శించి అన్నపూర్ణ మాతకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ప్రదేశంలోని మిగిలిన ఆకర్షణలవైపు కళ్లు తిప్పగలం.
పడవ విహరం
[మార్చు]సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవల్లో విహరించవచ్చు. ఎవరికివారు నడుపుకుంటూ వెళ్లేందుకు వీలున్న పడవలున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఆ సరస్సులో ప్రశాంత జలాలమీద నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం ఎంతో బావుంటుంది.
దేవీజలపాతం
[మార్చు]ప్రపంచ శాంతి కోరుతూ... ప్రపంచశాంతి కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచులో ఉంటుంది. అక్కడ నిలబడి పడమరగా తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లుగా ఉండదు. ఈ అందమైన ప్రకృతిని పగలంతా కాంచినా తనివితీరని సూర్యుడు దిగాలుగా వెళ్లలేక వెళుతున్నాడా అనిపిస్తుంది. నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి దిగుతుంటే పర్వత ఛాయలు లోయలంతా కప్పుతాయి. అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆ ప్రాంతమంతా హఠాత్తుగా మేఘాలు కమ్మినట్టయి చీకటిగా అవుతుంది. పక్షులు అరుపులు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ మార్పును చూస్తూ పర్యాటకులు మౌనంలోకి వెళతారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. గుప్తేశ్వర గుహ పోఖరాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. అది గుప్తేశ్వర మహాదేవుని నిలయం. దాదాపు 140 మీటర్ల పొడవున్న గుహ అది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆ గుహగుండా ప్రయాణం చేసి ఆవలకు చేరుకునేసరికి సరిగా ఎదురుగా పాలరంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. అది దేవీజలపాతం.