Jump to content

పోతనపల్లి జయమ్మ

వికీపీడియా నుండి

పోతనపల్లి జయమ్మ సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు[1].

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం లక్కవరానికి చెందిన శృంగవరపు నరసింహులు రెండో కుమార్తె. ఈమె తండ్రి తొలితరం కమ్యూనిస్టుగా ఉద్యమంలో ఉండేవాడు. తండ్రి బాటలో ఆమె చిన్నతనంలోనే ఉద్యమంలోకి అడుగుపెట్టింది. 1969లో ఆమె తండ్రి ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. ఆమె మహేంద్రగిరుల్లో దళాలతో పనిచేస్తున్నప్పుడు మల్లికార్జునను పెళ్ళి చేసుకుంది. వివాహమైన 20 రోజుల్లోనే ఆమె భర్త పోలీసు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆమె ఏవోబీలో పనిచేస్తున్నప్పుడు పోతనపల్లి కుమార్‌ను వివాహం చేసుకుంది.[2] వీరికి మొదటి సంతానం కుమార్తె పుట్టగా గిరిజనులకు దత్తత ఇచ్చేశారు. రెండో సంతానం కుమారుడు పుట్టగా ఓ రైతుకు పెంపకానికి ఇచ్చేశారు.

ఆమె శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతుల పోరాటంలో పాల్గొని సుమారు 30 ఏళ్లు అజ్ఞాతవాసం చేసింది. జయమ్మ అజ్ఞాతంలో ఉండగానే 1996లో పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది.1998లో లొత్తూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో ఆమె భర్త మృతి చెందాడు. భర్త మృతి తర్వాత ఆమె బొడ్డపాడు గ్రామం లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరు సాగించింది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎక్కువశాతం గిరిజన ప్రాంతాల్లో ఉండటంతో సవర, ఒడియాభాషలు నేర్చుకుంది.[3] ఆమె ప్రస్తుతం న్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలిగా, ప్రగతిశీల మహిళాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తుంది[4].

ఆమె 2020 ఫిబ్రవరి 24న తన 70వ యేట అనారోగ్యంతో కన్నుమూసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "పట్టాలు మంజూరు చేయాల్సిందే.. -praja sakthi | PublicVibe | India's Best Local News App". PublicVibe. Archived from the original on 2020-02-25. Retrieved 2020-02-25.
  2. "ఉద్యమాల జయమ్మ కన్నుమూత". www.andhrajyothy.com. Retrieved 2020-02-25.
  3. "ప్రజా ఉద్యమ నాయకురాలు జయమ్మ మృతి". www.eenadu.net. Archived from the original on 2020-02-25. Retrieved 2020-02-25.
  4. "సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు జయమ్మ కన్నుమూత - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-25. Retrieved 2020-02-25.
  5. "విప్లవోద్యమ నాయకురాలు జయమ్మ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 2020-02-24. Retrieved 2020-02-25.