Jump to content

పోలీన్ జెక్ సినిమా

వికీపీడియా నుండి

పోలీన్ జెక్ సినిమా(Pauline) ఇంగ్షీషు సబ్ టైటిల్స్ లో కొన్ని సార్లు లిటిల్ Pauline అని, Pauline అని వేశారు. ఇది 1974 లో జెక్ భాషలో తొలుత Pavlinka పేరుతో తీసిన చిత్రం. 1870 మార్చి నెలలో జెకోస్లోవేకియాలో Savrov టౌన్లో అక్కడ ఉన్న ఒక్క బట్టల కర్మాగారంలో శ్రామికులు జీతల పెంపుదలకోసం సమ్మెకుదిగారు. సావ్.రోవ్ కొండప్రదేశం, పంటలు పండని ఊసర భూములు, ప్రజలకు ఆ కర్మాగారం లేకపోతే జీవనాధారం లేదు. ఫ్యాక్టరీ యజమాని పరమ దుర్మార్గుడు, శ్రామికుల శ్రమదోపిడీ చెస్తూ చాలా కొద్ది జీతంతో పనిచేయించుకొంటూ వుంటాడు. ఆ Savrov టౌన్లో ఒక అనాధ బాలిక పోలీన్, బాల్యంలోనే తల్లితండ్రులు చనిపోతే జేజమ్మ పెంచుతుంది. ఆ అమ్మాయి పూసల దండలు తయారుచేసి జేజమ్మకు సహాయం చేస్తూ ఉంటుంది. కర్మాగారం పనివాళ్ళు జీతాల పెంపుకోసం సమ్మెచేస్తారు. యజమాని మిలీటరీని పిలిపిస్తాడు. ప్రతీకారంగా కార్మికులు కర్మాగారం కొసం నిలవచేసిన నీటిని వదిలేస్తారు. ఒక పర్యాయం బీళ్ళలో మూలికలు సేకరించుకొని ఇంటికి తిరిగివస్తూ, ఫ్యాక్టరీలో కార్మికుడు Paval zac ను కలుసుకొంటుంది. పరిచయం ప్రేమగా పరిణమిస్తుంది. సవరోవ్ లో సమ్మె జరిగినపుడు సమ్మెను భగ్నం చేయడానికి కర్మాగారం యజమాని మిలీటరీని సమ్మెచేస్తున్న కార్మికులమీదికి పంపుతాడు, ఆ కాల్పుల్లో దారమ్మట వెళుతున్న పోలీన్ గాయపడుతుంది, ఆమె ప్రియుడు బహూకరించిన క్రిస్మస్ కొత్త గవును మొత్తం రక్తంతో తడిసిపోతుంది. ప్రియుడు ఇచ్చిన పూలగుత్తి ఆమె రక్తంతో ఎరుపురంగులోకి మారిపోతుంది. పోలీన్ పంజరంలో పెంచుకొనే బుల్లిపిట్టను ఆమె జేజమ్మ పంజరంలోంచి వదలిపెడుతుంది. సినిమా సహజంగా కనిపించేందుకు దర్శకుడు ఆ దృశ్యాలన్నీ Savrov పరిసరాల్లోనే తీశాడు. Pauline తొలుత జెక్ భాషలో నవలగా వచ్చింది, వాస్తవ సంఘటనల ఆధారంగా. దాన్నే తర్వాత సినిమాగా తీశారు.

మూలాలు: పోలీన్ జెక్ సినిమా(Pauline)