Jump to content

పోలేపల్లి వెంగన్న శ్రేష్టి

వికీపీడియా నుండి

పోలెపల్లి వెంగన్న శ్రేష్టి గారు మొదటి తరం గ్రంథాలయోధ్యమములోని ప్రముఖులలో ఒకరు.

జననము

[మార్చు]

శ్రీ పోలెపల్లి వెంగన్న శ్రేష్టి గారు 1909లో ఆగర్భ శ్రీమంతుల కుటుంబములో కడప జిల్లాలో జన్మించారు. కడప జిల్లాలో వీరు (ప్రస్తుతము వై.ఎస్.ఆర్ జిల్లా) రాజా శ్రేష్టి గా ప్రసిద్దులు.

గ్రంథాలయోద్యమంలో పాత్ర

[మార్చు]

1923 వ సంవత్సరములో తన ఇంట కేవలము 40 పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. దానికి శ్రీ రామచంద్ర పుస్తక బాండారముగా నామ కరణము చేశారు. ప్రభుత్వము నుంచి గాని, ప్రజలనుంచి గాని ఎటువంటి ఆర్థిక సహకారము లేకుండా ఈ నాటికి ఆ గ్రంథాలయము అనేక అరుదైన గ్రంథాలతో అలారారు తున్నది. స్వంత ఖర్చులతో అనేక పత్రికల సంపుటాలను సేకరించి ఈ గ్రంథాలయములో పదిల పరిచారు. గ్రంథాలయము ప్రారంభమునుండి అయ్యంకి వెంకటరమణయ్య వారి సలహాలను పాటిస్తూ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరిచారు. అయ్యంకి వారి సేవలను గుర్తించి 1979 లో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ సంఘము వీరిని ఘనంగా సన్మానించింది.

మూలాలు

[మార్చు]

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.