ప్రజ్ఞాపారమిత
ప్రజ్ఞాపారమిత అంటే మహాయాన బౌద్ధంలో జ్ఞానానికి పరిపూర్ణత. కొన్ని సూత్రాల సమాహారంగానూ, బోధిసత్వునిలోని భాగమైన గొప్ప తల్లి (టిబెటన్: యుమ్ చెన్మో) అనే రూపం ఇచ్చి ఓ సమగ్రమైన పద్ధతిలో ప్రకృతి స్వరూపాన్ని దర్శించడాన్ని ప్రజ్ఞాపారమితగా వ్యవహరిస్తారు. ప్రజ్ఞాపారమిత అన్న పదం ప్రజ్ఞ అన్న పదానికి పారమిత - పరిపూర్ణత చేరగా ఏర్పడింది. ప్రజ్ఞాపారమిత అన్నది మహాయాన బౌద్ధంలో ప్రధానమైన భావన, సాధారణంగా ఇది శూన్యత్వం. స్వభావలేమితో పాటు నాగార్జునాచార్యుని సిద్ధాంతాలు, రచనలతో ముడిపడివుంది. బోధిసత్వుని మార్గంలో ప్రధానమైన అంశాల నుంచి దీని ఆచరణ, అవగాహన స్వీకరించారు.
ఎడ్వర్డ్ కోన్జె ప్రకారం, ప్రజ్ఞాపారమిత సూత్రాలు "భారతదేశంలో క్రీపూ 100 నుంచి క్రీశ 600 వరకూ రాసిన 40 వరకూ రచనల సంకలనం"[1] కొన్ని ప్రజ్ఞాపారమిత సూత్రాలు మహాయాన సూత్రాల్లో అత్యంత ప్రాచీనమైనవిగా గుర్తించబడ్డాయి.[2][2]
ప్రజ్ఞాపారమిత సూత్రాలకు సంబంధించి అత్యంత ప్రధానమైన అంశం - అనుత్పాద (ఇంకా జన్మించని, ఏర్పడని అని అర్థం)..[3][4]
చరిత్ర
[మార్చు]తొలనాళ్ళ కృతులు
[మార్చు]అష్టసహస్రిక ప్రజ్ఞాపారమితః
[మార్చు]పాశ్చాత్య పండితులు సంప్రదాయికంగా ప్రజ్ఞాపారమిత శ్రేణిలో ప్రాచీనమైన సూత్రంగా క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన అష్టసహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర (8వేల వాక్యాల్లో పరిపూర్ణమైన ప్రజ్ఞ అని అర్థం) [5] ఈ కాలనిర్ణయం ఇతర భాషల్లోకి అనువాదాలు జరిగిన తేదీలను అనుసరించి నిర్ణయించిన ఎడ్వర్డ క్రోన్జ్ అభిప్రాయాల ప్రకారం జరిగింది. అష్టసహస్రిక ప్రజ్ఞాపారమితకు చైనీస్ భాషలోకి తొలి అనువాదం సా.శ2వ శతాబ్దం నాటికి. ఈ పాఠ్యానికి సంబంధించిన మరొక వెర్షన్ కు రత్నగుణాసంచయ గాథ కొందరి ప్రకారం ప్రామాణిక సాహిత్య సంస్కృతంలో రాయలేకపోవడం వల్ల కొద్దిగా ప్రాచీనమైనదని భావిస్తారు.
ప్రజ్ఞాపారమిత సూత్రాల సారాంశం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Conze, E. Perfect Wisdom: The Short Prajnaparamita Texts, Buddhist Publishing Group, 1993
- ↑ 2.0 2.1 Williams, Paul.
- ↑ Buswell, Robert; Lopez, Donald S. Jr., eds. (2014), The Princeton Dictionary of Buddhism, Princeton University Press pg. 945 "In the PRAJÑĀPĀRAMITĀ literature and the MADHYAMAKA school, the notion of production comes under specific criticism (see VAJRAKAṆĀ), with NĀGĀRJUNA famously asking, e.g., how an effect can be produced from a cause that is either the same as or different from itself.
- ↑ King, Richard (1995), Early Advaita Vedānta and Buddhism: The Mahāyāna Context of the Gauḍapādīya-kārikā, SUNY Press pg.113 "It is equally apparent that one of the important features of the Prajnaparamita positition is that of the nonarising (anutpada) of dharmas."
- ↑ Mäll, Linnart.
ఇతర లింకులు
[మార్చు]- Mahāprajñāpāramitā Mañjuśrīparivarta Sūtra: English Translation, Lapis Lazuli Texts
- The Prajnaparamita Literature Bibliography of the Prajnaparamita Literature
- Lotsawa House Translations of several Tibetan texts on the Prajnaparamita