అంగర సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
author personal data
పంక్తి 43: పంక్తి 43:


==వృత్తి==
==వృత్తి==
1949లో  విశాఖపట్నంలో విద్య శాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు. 
1949లో  విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు. 


==రచనలు==
==రచనలు==

16:09, 16 అక్టోబరు 2016 నాటి కూర్పు

అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.

అంగర సూర్యారావు
అంగర సూర్యారావు
జననంSurya Rao
4 july 1927
Mandapeta ( East godavari dist, Andhrapradesh)
నివాస ప్రాంతం22-67-5/1, chopudargalli, Town hall road, Visakhaptam-1
వృత్తిAP govt. Retd Employee
ప్రసిద్ధితెలుగు నాటక రచయిత, చరిత్రకారుడు.
తర్వాత వారుAngara Krishnarao, Angara Venkateswara Rao
భార్య / భర్తPadmavathi
తండ్రిNaganna
తల్లిveeramma

బాల్యం

అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.

విద్య

విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.

వృత్తి

1949లో  విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు. 

రచనలు

  • తొలి రచన 1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)
  • మొదటి  కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.
  • ' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
  • 1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
  • ' ఆంధ్ర సచిత్ర వారపత్రిక' ,' భారతి సాహిత్య మాస పత్రిక' , 'ఆంధ్ర ప్రభ', సచిత్ర వార పత్రికలలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
  • పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 

పుస్తకాలు

  • కళోద్ధారకులు ( నాటికలు - 1956)
  • శ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 1959 )
  • నీలి తెరలు ( నాటకం - 1959)
  • పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
  • ఇది దారి కాదు ( నాటకం - 1967)
  • ఎనిమిది నాటికలు ( 1976 )
  • చంద్రసేన ( నాటకం - 1976 )
  • రెండు శతాబ్దాల విశాఖ నగర చరిత్ర ( 2006 )
  • సమగ్ర విశాఖ నగర చరిత్ర - మొదటి భాగం ( 2012)
  • సమగ్ర విశాఖ నగర చరిత్ర - రెండవ భాగం ( 2014)
  • 60 ఏళ్ళ ఆంధ్ర  సాహిత్య చరిత్రలో పురిపండా ( అముద్రితం)
  • ఉత్తరాంధ్ర సమగ్ర  సాహిత్య చరిత్ర ( అముద్రితం)

రచన శైలి

  • నిశితమైన వ్యంగ్యం వుపయోగించి ఎదుటి వాడిని చకిత పరచడమూ,సున్నితమైన హాస్యంతో నవ్వినచడమూ, తప్పు చేసి తప్పుకొనే మనిషిని నిలువునా నిలదీయడమూ వీరి నాటికలు, నాటకాలలోని ప్రత్యేకత.
  • వీరి రచనలలోని పాత్రలు సమాజంలో మన చుట్టూ తిరుగుతుండేవే. అందుకనే వారి రచనలు సజీవమైనవి...సత్య దూరం కానివి. వీరి నాటికలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ నాలు మూలాల రంగస్థలాలకెక్కాయి.
  • రచనలో మాత్రమే కాక  నాటక ప్రయోగంలో సూర్యారావు గారికి మంచి అనుభవమూ, అభినివేశమూ వుంది. రంగశాల అనే సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షులుగా వుండి ప్రయోగాత్మక కృషి చేసారు.

ఉదాహరణలు

సాహిత్య సేవ

  • 1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 
  • 1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ, 
  • 1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ వున్నారు. 

పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు

మూలాలు

బాహ్యా లంకెలు

[1]