వికీపీడియా:విజువల్ ఎడిటర్

వికీపీడియా నుండి
(వికీపీడియా:విజువల్ఎడిటర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విజువల్ ఎడిటరును ప్రారంభించండి. విజువల్ ఎడిటరు యూజర్ గైడ్ చదవండి.
లాగిన్ అయ్యాక, పై లింకు లోని అభిరుచులు పేజీ లోని, దిద్దుబాట్లు ట్యాబులో "విజువల్ ఎడిటర్ బీటా రూపంలో వున్నప్పుడు తాత్కాలికంగా అచేతనం చేయి.'" పెట్టెలో టిక్కు తీసెయ్యండి. "సవరణ విధం:" లో దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు ను కూడా ఎంచుకోవచ్చు. ఆ తరువాత మీ అభిరుచులను భద్రపరచండి. మీకు వికీలో ఖాతా లేకపోతే, పరీక్ష కోసం ఈ ప్రయోగశాలను ఉపయోగించండి. లింకులను ఎలా తయారు చేయాలో, చిత్రాలను జోడించడం లేదా తరలించడం, అనులేఖనాలను సృష్టించడం, మూస‌లను చొప్పించడం, పట్టికలను సవరించడం, తదితరాల గురించి తెలుసుకోండి. మీరు వాడిన వెబ్ బ్రౌజర్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, వికీపీడియా రూపు (సాధారణంగా వెక్టర్, కొన్నిసార్లు మోనోబుక్) లను మీ నివేదికలో చేర్చండి.
2021 మార్చి నాటికి, తెలుగు వికీపీడియా ఎడిటర్లు లక్షా ముప్పైవేల పైచిలుకు దిద్దుబాట్లు చేయడానికి విజువల్ ఎడిటరును ఉపయోగించారు.

వికీమీడియా ఫౌండేషన్ (డబ్ల్యుఎంఎఫ్) అభివృద్ధి చేస్తున్న విజువల్ ఎడిటరు కు స్వాగతం. ఇది వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు తయారు చేసిన ఉపకరణం. దీన్ని వాడాలంటే సంపాదకులు వికీ మార్కప్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. విజువల్ ఎడిటరు ఆవిర్భవించక ముందు సంపాదకులు సవరణలు చేయడానికి వికీ మార్కప్ నేర్చుకోవలసి వచ్చేది. విజువల్ ఎడిటరు రాకతో వికీటెక్స్ట్ మార్కప్ నేర్చుకోకుండానే అనేక రకాల పేజీలను సవరించడానికి వీలు కలిగింది. ఈ కారణంగా ఎక్కువ మంది పాఠకులు సంపాదకులుగా మారేందుకు ప్రోత్సాహం లభిస్తుందని WMF సిబ్బంది ఆశిస్తున్నారు.

విజువల్ ఎడిటరు పూర్తి-స్థాయి విశేషాలతో విడుదలైన తర్వాత కూడా, అనుభవజ్ఞులైన సంపాదకులు వికీటెక్స్టు‌ను సవరించడానికే ఇష్టపడవచ్చు. ఎందుకంటే అది వేగంగా, మరింత ఖచ్చితంగా పని చేసేందుకు అనుగుణంగా ఉంటుందని వాళ్ళు భావించవచ్చు. వ్యాసాలను పూర్తిగా వికీటెక్స్టు లోనే సవరించడం అనే సౌకర్యం ఇంకా అందుబాటులో ఉంది. ఇకముందూ ఉంటుంది. దిద్దుబాటు చెయ్యడం విజువల్ ఎడిటరుతో మొదలుపెట్టినప్పటికీ, ఏ క్షణమైనా వికీటెక్స్టుకు మారిపోయే అవకాశం పరికరాల పట్టీలో ఉంటుంది.

విజువల్ ఎడిటరులో ఇప్పటికీ అనేక దోషాలున్నాయి. కొన్ని విశేషాలు అసలు లేనేలేవు కూడా. దాన్ని వాడడంలో సమస్యలేమైనా ఎదురైతే, దాన్ని అభిప్రాయ పేజీలో నివేదించవచ్చు. అయితే ఆ పేజీని WMF సిబ్బంది పెద్దగా చూడరు.ఫాబ్రికేటర్ లోని బగ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆ దోషాలను నివేదించవచ్చు.

విజువల్ ఎడిటరు గురించి

[మార్చు]

విజువల్ ఎడిటరు అనేది వికీపీడియాను సవరించే "దృశ్య" పద్ధతి. వికీ మార్కప్ నేర్చుకోకుండానే ప్రజలు వికీలో రాసే సదుపాయాన్ని ఇది కలుగ జేస్తుంది. ఈ రిచ్-టెక్స్ట్ ఎడిటరు 2012 డిసెంబరులో ఇంగ్లీషు వికీపీడియాలో, 2013 ఏప్రిల్ లో 14 ఇతర భాషలలోను 2013 జూన్ ప్రారంభంలో అనేక ఇతర భాషలలో ఎంచుకుంటే అందుబాటులోకి వచ్చేలానూ ఉంచారు. ఏప్రిల్ 2015 నాటికి, ఇది డిఫాల్టుగా 76% భాషల వికీపీడియాల వినియోగదారులకు అందుబాటులో ఉంది. మిగిలిన వాటికి, విక్షనరీ, వికీసోర్స్ మినహా చాలా వికీపీడియాయేతర ప్రాజెక్టులతో పాటు, ఆప్ట్-ఇన్ బీటా లక్షణంగా అందుబాటులో ఉంది.

విజువల్ ఎడిటరు ఉపయోగించడం గురించి మరింతగా తెలుసుకోవడానికి, విజువల్ ఎడిటరు వాడుక మార్గదర్శిని చదవండి.

పరిమితులు

[మార్చు]

ప్రస్తుత తెలిసిన పరిమితులివి:

  • చర్చ లోను, ఇతర చర్చ పేరుబరుల్లోనూ ఇది అందుబాటులో లేదు - తెలుగు వికీపీడియాలో, చర్చ పేజీలకు, మూస, వికీపీడియా పేరుబరులకు, అరుదుగా దిద్దుబాట్లు జరిగే అనేక ఇతర పేరుబరులకూ విజువల్ ఎడిటరు అందుబాటులో లేదు. ఆయా పేజీల్లో విజువల్ ఎడిటరు కోసం "సవరించు" బొత్తం అందుబాటులో ఉండదు.
  • మూస పరామితులు వికీటెక్స్టే, రిచ్ టెక్స్ట్ కాదు - విజువల్ ఎడిటరు మూస ట్రాన్స్‌క్లూజన్ల పరామితులను సవరించడానికి వీలు కలిగిస్తుంది, కానీ ఇది "వికీటెక్స్ట్"గా మాత్రమే సాధ్యం.
  • అసంపూర్ణ సవరణ కార్యాచరణ - నిర్వచన జాబితాలతో సహా కొన్ని సంక్లిష్టమైన ఆకృతీకరణ ఉండే కంటెంటును చూపిస్తుంది. దాన్ని దిద్దనూ వచ్చు. కానీ విజువల్ ఎడిటరును ఉపయోగించే సంపాదకులు వాటిలోని కొన్ని వివరాలను సవరించలేరు. బహుళ కాలమ్ జాబితాలను సంక్లిష్టమైన ట్రాన్స్క్లూజన్ డైలాగ్ పెట్టె ద్వారా సవరించవచ్చు గానీ, ఇది కష్టతరమైన విషయం. మొబైల్‌లో పట్టిక దిద్దుబాటు సరిగా పనిచేయదు.
  • కొన్ని బ్రౌజర్‌లకు మద్దతు లేదు - విజువల్ ఎడిటరు దాదాపు అన్ని ఆధునిక బ్రౌజర్లలో పనిచేస్తుంది. Chrome / Chromium, Firefox, Edge, Internet Explorer, Safari, Opera, Midori, Falkon (పూర్వం కుప్జిల్లా), SeMonkey, WebPositive (మొత్తం బ్రౌజరు వినియోగదారులలో 95% మంది వీటిని వాడుతారు) లలో ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 10 వంటి వెబ్ ప్రమాణాలను పాటించని కొన్ని బ్రౌజర్‌లలో విజువల్ ఎడిటరు ఎప్పటికీ పనిచేయదు. మీ బ్రౌజరులో విజువల్ ఎడిటరు అందుబాటులో లేకపోతే, లేదా మీరు జావాస్క్రిప్ట్‌ను ఆపివేసి ఉన్నట్లయితే, మీకు వికీటెక్స్ట్ ఎడిటరు బొత్తాలు మాత్రమే కనిపిస్తాయి.
  • మూసల లోపల ఫుట్‌నోట్స్ - మూసల లోపల ఫుట్‌నోట్స్ (సాధారణంగా, సమాచారపెట్టెలు, {{reflist}} లు) "పునర్వినియోగం" డైలాగ్‌లో కనిపించవు, దీనివల్ల ప్రధాన విజువల్ ఎడిటరు ఎడిటింగ్ విండో దిగువన ప్రదర్శించబడే ఫుట్‌నోట్‌ల సంఖ్యలో వ్యత్యాసాలు ఏర్పడతాయి.
  • అసమతుల్య మూసలు - విజువల్ ఎడిటరు అసంపూర్ణమైన కోడ్‌ను, మార్కప్‌తో, మరొక టెంప్లేట్ లేదా టేబుల్‌కు పంపే టెంప్లేట్‌లతో ఇబ్బంది పడుతుంది. విజువల్ ఎడిటరులో ఎంచుకుంటే ఇవి విచిత్రంగా కనిపిస్తాయి, సరిగ్గా దిద్దుబాటు చెయ్యలేరు.
  • నెమ్మదిగా - విజువల్ ఎడిటరులో పెద్ద పేజీలను లోడ్ చేయడం కొంతమంది వినియోగదారులకు 60 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.
  • ఒక్క విభాగాన్ని సవరించలేరు - విజువల్ ఎడిటరు మొత్తం పేజీలను మాత్రమే లోడ్ చేసి చూపిస్తుంది. ఒక్క విభాగపు "మార్చు" లింకును నొక్కినా పూర్తి పేజీని తెరిచి ఆ తర్వాత సంబంధిత విభాగానికి స్క్రోల్ అవుతుంది. విజువల్ ఎడిటరు నమూనాలో విభాగాలను దిద్దడం మొత్తం పేజీని దిద్దడం కంటే నెమ్మదిగా ఉంటాయి. [గమనిక: దిద్దుబాటు కోసం మొత్తం పేజీని తెరిచినంత మాత్రాన దిద్దుబాటు ఘర్షణలు పెరగవు. ఇవి పేరాలను బట్టి ఉంటాయి ]
  • ఉచితేతర చిత్రాలను ఎక్కించలేరు - ఈ సమయంలో, వికీటెక్స్ట్ ఎడిటరు లేదా విజువల్ ఎడిటరు నుండి ఎక్కించే చిత్రాలు నేరుగా వికీమీడియా కామన్స్‌కు వెళ్తాయి, అది ఉచితం-కాని చిత్రాలను అనుమతించదు. వికీపీడియా నాన్-ఫ్రీ కంటెంట్ పాలసీ పరిధిలోకి వచ్చే అన్ని చిత్రాలను ఫైల్ అప్‌లోడ్ విజార్డ్ ను ఉపయోగించి స్థానిక వికీపీడియాలోకి ఎక్కించాలి.
  • మూసలు చేసిన పట్టిక ఫార్మాటింగ్ గురించి దీనికి తెలియదు - జనాదరణ పొందిన టేబుల్ సెల్ <b id="mwZA">మూసలు</b> (ఉదా. అవును, లేదు, టిబా, ఎన్ / ఎ) సమస్యలను కలిగిస్తాయి. కారణం ఏమిటంటే, ఈ మూసల్లో ఫార్మాటింగును, పాఠ్యాన్నీ వేరు చేయడానికి పైప్ క్యారెక్టరు ఉంటుంది, కానీ విజువల్ ఎడిటరుకు దీని గురించి తెలియదు. ఫలితంగా, గడుల విలీనం / విడతీత లేదా అడ్డు వరుసలు, నిలువు వరుసలను చొప్పించడం / తొలగించడం / తరలించడం వంటి పట్టిక కార్యకలాపాలు సరిగా పనిచేయకపోవచ్చు.
  • అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలు వాటి అంతటా కదిలితే విలీనమైన గడుల్లోని డేటా పోతుంది. తాత్కాలిక పరిష్కారం: తరలించే ముందు ప్రభావిత గడులను విడదీసి, తరువాత వాటిని మళ్లీ విలీనం చేయండి.

పేజీని సేవ్ చేసే ముందు వికీటెక్స్ట్ మార్పులను సమీక్షించడానికి మీరు "మీ మార్పులను సమీక్షించండి" ని నొక్కవచ్చు. సమస్యలేమైనా ఎదురైతే ఇక్కడ నివేదించండి.

ఎలా సహాయం చేయవచ్చు

[మార్చు]

విజువల్ ఎడిటరు బాగా పనిచేయడానికి మీ సహాయం అవసరం: దోషాలను, మెరుగుపరచే ఆలోచనలను నివేదించవచ్చు లేదా అనేక ఇతర పనులలో సహాయం చెయ్యవచ్చు, అవి:

  • సహాయ పేజీలను నవీకరించడం - వికీమీడియా ఫౌండేషన్ వారి ప్రాజెక్టులన్నిటి లోను కొత్త సంపాదకులకు పని సులభతరం చేయడానికి సహాయ పేజీలుంటాయి. దురదృష్టవశాత్తు, విజువల్ ఎడిటరు కోసం సరైన సహాయ పేజీలు అందుబాటులో లేవు. ఎందుకంటే అవి మార్కప్ ఎడిటరు ఉపయోగించి ఎలా సవరించాలో వివరిస్తాయి. అందువల్ల, సహాయం పేజీలను నవీకరించడానికి మీ సహాయం కావాలి. విజువల్ ఎడిటరుకు యూజర్ గైడ్ క్రొత్త సహాయ పేజీలకు తొలి అడుగు.
  • మూస డాక్యుమెంటేషన్ పేజీలకు మూస డేటా కోడ్‌ను చేర్చడం - విజువల్ ఎడిటరులో ఇంటరాక్టివ్ టెంప్లేట్ ఎడిటరు ఉంది- యూజర్ గైడ్‌లో దీని గురించి మరింత వివరంగా ఉంటుంది. కొన్ని మూసలు పేరున్న పరామితులను, ఇంటరాక్టివ్ మూసల‌ను తయారుచేసే చక్కటి వివరణలను చూపిస్తాయి. వికీపీడియాలో పనిచేస్తున్నపుడూ మీరు ఇది చూడవచ్చు. ఎడిటరు ఉపయోగించడానికి సులభం. అయినప్పటికీ, ఇతర మూసలకు ఈ సౌకర్యం లేదు. ఎందుకంటే ఈ లక్షణం పనిచేయాలంటే వాటి డాక్యుమెంటేషన్ పేజీల్లో టెంప్లేట్‌డేటా కోడ్ ఉండాలి. టెంప్లేట్‌డేటాను చేర్చడానికి మీకు ఆసక్తి ఉంటే, దాని గురించి చదవండి. చాలా ఎక్కువగ ట్రాన్స్‌క్లూడ్ చేసిన మూసల్లోడాక్యుమెంటేషన్‌లో టెంప్లేట్‌డేటా చేర్చాల్సిన అవసరం ఉన్నవి చాల ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
  • క్రొత్త వినియోగదారులకు సహాయం చేయండి - విజువల్ ఎడిటరుతో సవరించడం సులభం అయినప్పటికీ, విధానాలు, మార్గదర్శకాలను నేర్చుకోవడం, సముదాయంతో ఎలా వ్యవహరించాలనే విషయాలు క్రొత్త సంపాదకులకు ఎల్లప్పుడూ సవాలుగానే ఉంటూంటాయి. హెల్ప్ డెస్క్, చర్చ పేజీలు వంటి తగిన వేదికలలో సమయం గడపుతూ మీరు వారికి సహాయం చేయవచ్చు. అదనంగా, దయచేసి సహాయం కోసం చూస్తున్న వికీపీడియన్ల వర్గాన్ని చూస్తూ ఉండండి. ఆ వర్గంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న అంశాలు ఉంటాయి.

బాహ్య లింకులు

[మార్చు]