8,967
దిద్దుబాట్లు
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
==ముఖపక్షవాతం==
ముఖ కండరాలకు సరఫరా చేసే ఏడవ క్రేనియల్ నాడీకి వచ్చే సమస్యలు (ఇన్‌ఫ్లమేషన్) వల్ల మూతి వంకరపోతుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో బెల్స్ పాల్సి అంటారు.చలికాలంలో రాత్రులు బస్సులో ప్రయాణిస్తుంటే కిటిక పక్కన కూర్చున్న వారి చెవిలోకి చలిగాలిపోయి నరంపై ఒత్తిడి తగిలి బెల్స్ పాల్సి వచ్చే అవకాశం ఉంది. 'హెర్పస్ జోస్టర్ వైరస్' ఇన్‌ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో సమస్యగా మారొచ్చు.బెల్స్ పాల్సి (ముఖ పక్షవాతం)కి గురైన వారిలో ముఖంలో ఒకవైపు కండరాలు చచ్చు బడిపోతాయి. చెవి దగ్గర కొద్దిగా నొప్పి ఉంటుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లు, కళ్లు ఎండిపోయినట్లు వుండొచ్చు. నాలుక పక్కకు ఉంటుంది. కన్ను మూయలేక పోవడం వల్ల దుమ్ముపడి 'కెరిటైటిస్' అనే సమస్య వచ్చి కళ్ల వెంట నీరు కారుతుంది. కుడివైపు ముఖ పక్షవాతం వచ్చినవారు నవ్వినప్పుడు మూతి ఎడమవైపునకు లాగినట్లు వంకరపోయి కనిపిస్తుంది. బెలూన్ ఊదలేకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, దవడలో ఆహారం ఉంచుకోలేకపోవడం జరుగుతాయి. మాటలో మార్పు కనిపిస్తుంది. నుదురుమీద ముడతలు ఏర్పడవు. ఈలవేయలేరు. పెదవుల్లో కదలికలు మందగిస్తాయి.
==మెదడులో సునామీ
పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి.ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. అదే నిమిషం సమయంలో నాడీకణాల -న్యూరాన్లు- మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోవడమే పక్షవాతానికి మూలం.పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగే అవకాశం నాడీకణాలు మరణించే సంఖ్యపైనే ఆధారపడి ఉండుంది.
అందుకే పక్షవాతం లక్షణాలు కనబడిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతానికి గురైన మొదటి మూడు గంటల్లో రక్తపు గడ్డలను కరిగించే మాత్రలను వేసుకుంటే, దీనివల్ల అవయవాలు చచ్చుబడిపోవడం లాంటి నష్టాలు చాలావరకు తగ్గుతాయని వైద్యుల వివరిస్తున్నారు.శరీరంలోని ఏదైనా అవయవానికి ఇలా రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించి స్ట్రోక్ సంభవిస్తుంది. స్ట్రోక్స్‌లో గుండెపోటు, పక్షవాతం ముఖ్యమైనవి. తర్వాత ఊపిరితిత్తులు, కాళ్లలో ఇలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటోంది. ఇలా ఒంట్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చినా ఆస్పిరిన్ మాత్ర వేసుకోవాలట.ఛాతీలో గుండెనొప్పి వచ్చినప్పుడు ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటే మరణాన్ని తప్పించుకోగలిగినట్లే పక్షవాతం వచ్చిన సందర్భాల్లో కూడా ఆస్ప్రిన్ మాత్ర చప్పరిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
==చూడండి==
*http://3.bp.blogspot.com/_Ggas1AmqS9s/SssgAwlqgcI/AAAAAAAAX7w/dKggUOB0bPo/s1600-h/6+pakshavatham.jpg
*http://www.eenadu.net/archives/archive-19-10-2009/specialpages/sp-health.asp?qry=sp-health4
[[వర్గం:వ్యాధులు]]
|
దిద్దుబాట్లు