ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 55: పంక్తి 55:


==విశేషాలు==
==విశేషాలు==
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[పి.సుశీల]]కు ఈ పాట వలన 1982 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయనిగా నంది బహుమతి లభించింది. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.

==అవార్డులు==
* [[పి.సుశీల]]కు ఈ పాట వలన 1982 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నేపథ్య గాయనిగా [[నంది బహుమతి]] లభించింది.


==లింకులు==
==లింకులు==

03:24, 30 జనవరి 2011 నాటి కూర్పు

ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం అందించింది రమేష్ నాయుడు.

పాట

ఆ......

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనీ పారు సెలపాటలో తేటనై

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ తరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఎటులైనా ఇచటనే ఆగిపోనా

విశేషాలు

ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ మరియు అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.

అవార్డులు

లింకులు