రేఖాగణితం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: so:Joomitiri
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ba:Геометрия
పంక్తి 19: పంక్తి 19:
[[ast:Xeometría]]
[[ast:Xeometría]]
[[az:Həndəsə]]
[[az:Həndəsə]]
[[ba:Геометрия]]
[[bat-smg:Geuometrėjė]]
[[bat-smg:Geuometrėjė]]
[[be:Геаметрыя]]
[[be:Геаметрыя]]

15:14, 23 నవంబరు 2012 నాటి కూర్పు

తలం

రేఖాగణితం (ఆంగ్లం:Geometry) (గ్రీకు γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, యూక్లిడ్ రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.

నిరూపక రేఖా గణితం

వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన రెనెడెకార్టె (1596-1650) కనుక్కున్నాడు. ప్రత్యేక క్రమంలో అమర్చిన మూలకాల జత (a, b) ను ఒక క్రమయుగ్మం అంటారు. క్రమయుగ్మం (a,b) లో a ని ప్రథమ నిరూపకమనీ, b ని ద్వితీయ నిరూపకం అంటారు. ఒక తలంలోని ప్రతి బిందువును ఒక క్రమయుగ్మంతోనూ, విపర్యయంగా ఒక క్రమయుగ్మాన్ని ఒక బిందువుతోనూ సూచిస్తారు. ఒక తలాన్ని రెండు లంబరేఖలతో నాలుగు పాదాలుగా విభజించి అందులో బిందువులను వాస్తవ సంఖ్యా క్రమ యుగ్మాలతో సూచిస్తారు.

మూస:Link FA