ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q3284472 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:
Image:Muggu1.jpg|
Image:Muggu1.jpg|
Image:Muggu2.jpg|
Image:Muggu2.jpg|
File:Rangoli at Nizampet 01.JPG|
File:Sankranti Muggu with flowers at Nizampet.jpg|
బొమ్మ:Rangoli at hotel 2008-02-21.jpg|
బొమ్మ:Rangoli at hotel 2008-02-21.jpg|
</gallery>
</gallery>

17:31, 21 మే 2013 నాటి కూర్పు

సంక్రాంతి పండుగ నాడు,హైదరాబాదులోని ఓ ఇంటి ముందు వేసిన రథం ముగ్గు.
సింగపూర్‌లోని ఓ ముగ్గు

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనా కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.

ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తుంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి మరియు లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతో గాని సుద్ద ముక్కలతో గాని తడిచేసిన తర్వాత వేస్తారు.

ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు సాశ్వతంగా ఉండేటట్లు గదులలొ మధ్యన మరియు అంచుల వెంబటి వేసుకుంటారు.


ముగ్గు తయారీ

ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాదారణంగా ముగ్గులు పెట్టేది మామూలు పిండితో, తరువాత బట్టీల ద్వారా, నత్తగుల్లలు, ముగ్గు రాళ్ళతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు.

ముగ్గులు రకాలు

రంగు రంగుల ముగ్గు.
సాంప్రదాయ ముగ్గులు

మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.

రంగుల ముగ్గులు

కొన్ని విషేష సంధర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.

పండుగ ముగ్గులు

సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మలతోను అలంకరిస్తారు.

చుక్కల ముగ్గు

ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి. రథం ముగ్గు సంక్రాంతి సందర్బంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడ తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.

ముగ్గుల పోటీలు

సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు. రథం ముగ్గు సంక్రాంతి ముగ్గులలో విశేషమైనది.

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు


మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=ముగ్గు&oldid=849614" నుండి వెలికితీశారు