Jump to content

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన

వికీపీడియా నుండి

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ( Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY) అనేది నైపుణ్యాల గుర్తింపు, ప్రామాణికీకరణ కొరకు భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ స్కీం. ప్రధాన మంత్రి కౌశ ల్ వికాస్ యోజ న (పిఎమ్ కెవివై) ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు, ఇందులో ఉచిత స్వల్పకాలిక నైపుణ్య శిక్షణను అందించడం ద్వారా దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి, నైపుణ్యత (స్కిల్) సర్టిఫికేషన్ కోసం యువతకు ద్రవ్య బహుమతులను అందించడం ద్వారా, దేశ యువత పరిశ్రమ, ఉపాధిని పెంచడం అనేది ఈ పథకం ఆలోచన. 2016-2020 సంవత్సరాల సమయంలో కోటి మంది భారతీయ యువతకు శిక్షణ ఇవ్వాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.[1]

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
प्रधान कौशल विकास योजना
దస్త్రం:Pradhan Mantri Kaushal Vikas Yojana.png
దేశంభారతదేశం
మంత్రిత్వ శాఖ స్కిల్ డెవలప్ మెంట్ఎంటర్ ప్రెన్యూర్ షిప్
ప్రారంభం16 జూలై 2015; 9 సంవత్సరాల క్రితం (2015-07-16)
న్యూ ఢిల్లీ
స్థితిActive

చరిత్ర

[మార్చు]

2014-15లో బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం, భారతదేశం లోని పాఠశాలలలో స్కూలు లెవల్స్ (ప్రైమరీ, ప్రాథమికోన్నత, సెకండరీ) వద్ద పాఠశాలలనుంచి మధ్యలో వెళ్లేవారు (డ్రాపవుట్ రేటు) 4% నుంచి 17% వరకు ఉంది. అంతేకాకుండా, భారతీయ యువతలో నిరుద్యోగ రేటు 6.2% కంటే ఎక్కువగా ఉంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఈ విధంగా ఉండటముతో, భారతీయ యువతను ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించడానికి, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనను ప్రారంభించింది[2].

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) అనేది నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ (ఎంఎస్ డి ఇ) ప్రధాన పథకం. ఈ స్కిల్ సర్టిఫికేషన్ స్కీం లక్ష్యం ఏమిటంటే, పెద్ద సంఖ్యలో భారతీయ యువత మెరుగైన జీవనోపాధిని పొందడంలో వారికి సహాయపడే పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను చేపట్టడానికి దోహదపడుతుంది. ఇంతకు ముందు అభ్యసన అనుభవం లేదా నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు కూడా రికగ్నిషన్ ఆఫ్ ప్రీయర్ లెర్నింగ్ (RPL) కింద మదింపు చేయబడి, నైపుణ్యత పరీక్ష ( స్కిల్ సర్టిఫికెట్) అందచేస్తారు.[3]

పథకం కీలక భాగాలు

[మార్చు]

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) లోని కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి[4].

స్వల్పకాలిక శిక్షణ (ఎస్ టిటి) - పిఎంకెవివై శిక్షణా కేంద్రాల్లో (టిసిలు) అందించే స్వల్పకాలిక శిక్షణ పాఠశాల/కళాశాల మానేసినవారు లేదా నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులకు ఉద్దేశించింది. ఉద్యోగ పాత్రను బట్టి శిక్షణ కాలవ్యవధి మారుతుంది, అయితే, చాలా కోర్సులు 200-600 గంటల (2 – 6 నెలలు) మధ్య ఉంటాయి. పాఠ్యప్రణాళికలో భాగమైన సాఫ్ట్ స్కిల్స్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఫైనాన్షియల్,డిజిటల్ లిటరసీ కరిక్యులంతో నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (NSQF) ప్రకారం ఈ శిక్షణ (ట్రైనింగ్) ఇవ్వబడుతుంది. విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, అభ్యర్థులకు ట్రైనింగ్ పార్టనర్స్ (టిపిలు) ద్వారా ప్లేస్ మెంట్ అసిస్టెన్స్ అందించబడుతుంది.

రికగ్నిషన్ ఆఫ్ ప్రీయర్ లెర్నింగ్ (ఆర్ పిఎల్) - ఇంతకు ముందు అభ్యసన అనుభవం లేదా నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు పథకం లోని రికగ్నిషన్ ఆఫ్ ప్రీయర్ లెర్నింగ్ (RPL) కాంపోనెంట్ కింద మదింపు చేయబడి,సర్టిఫై చేయబడతారు. దేశంలోని అనియంత్రిత శ్రామిక శక్తి సామర్థ్యాలను NSQF కు సమలేఖనం చేయడమే లక్ష్యం. ట్రైనింగ్/ఓరియెంటేషన్ కాలవ్యవధి 12-80 గంటల మధ్య ఉంటుంది.

స్పెషల్ ప్రాజెక్ట్ లు - పిఎమ్ కెవివై స్పెషల్ ప్రాజెక్ట్స్ కాంపోనెంట్, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ లు/ఇండస్ట్రీ బాడీల ప్రత్యేక ప్రాంతాలు, ఆవరణల్లో శిక్షణలు (ట్రైనింగ్ లు),లభ్యం అవుతున్న క్వాలిఫికేషన్ ప్యాక్ లు (QPలు)/నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్ లు (NOSలు) కింద నిర్వచించబడని ప్రత్యేక జాబ్ రోల్స్ లో ట్రైనింగ్ లను ప్రోత్సహించడం కొరకు ఉద్దేశించబడింది.

ఈ పథకం రెండు భాగాల ద్వారా అమలు చేయబడుతోంది:

సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెంట్రల్లీ మ్యానేజ్డ్ (సిఎస్ సిఎమ్): నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కాంపోనెంట్ అమలు చేయబడుతుంది. పిఎమ్ కెవివై 2016-20 నిధులలో 75%, సంబంధిత భౌతిక లక్ష్యాలను సిఎస్ సిఎమ్ కింద కేటాయించారు.

సెంట్రల్ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్డ్ (సిఎస్ఎస్ఎమ్): ఈ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్లు (ఎస్.ఎస్.డి.ఎం) ద్వారా అమలు చేస్తాయి. పిఎమ్ కెవివై 2016-20 నిధులలో 25%, సంబంధిత భౌతిక లక్ష్యాలు CSSM కింద కేటాయించబడ్డాయి.

అర్హత

[మార్చు]

పిఎం కౌశల్ వికాస్ యోజన (పిఎమ్ కెవివై) ఈ పథకం కొరకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే,అర్హత ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి.[2]

పిఎమ్ కౌశల్ వికాస్ యోజన కింద అర్హత సాధించడం కొరకు వ్యక్తులు నిరుద్యోగ యువత అయి ఉండాలి లేదా అకడమిక్ కాలపరిమితి మధ్యలో స్కూలు లేదా కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయి ఉండాలి.

ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేదా ఓటరు ఐడి వంటి గుర్తింపు రుజువును కలిగి ఉన్న భారతీయ జాతీయుడు అయి ఉండాలి.

ప్రయోజనం

[మార్చు]

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ ఇండియా కార్డు, చెల్లుబాటు అయ్యే ధ్రువీకరణను అందిస్తుంది, దీని ఆధారంగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు,జీవనోపాధిని పొందవచ్చు.

సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులందరికీ పిఎమ్ కెవివై ఆర్థిక, ఉద్యోగం కలిపించే ( ప్లేస్ మెంట్) సాయాన్ని అందిస్తుంది.

పిఎమ్ కౌశల్ వికాస్ యోజన అనుభవజ్ఞులైన భారతీయ యువతకు వారి నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి శిక్షణను అందిస్తుంది.

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన నిరుద్యోగ యువతకు,కళాశాల లేదా బడి మానేసిన వారికి పరిశ్రమ ఆధారిత నైపుణ్యాల శిక్షణను అందిస్తుంది, తద్వారా వారు ఉపాధికి అర్హులు అవుతారు.


మూలాలు

[మార్చు]
  1. "Pradhan Mantri Kaushal Vikas Yojana" (PDF). dsde.goa.gov.in/. 25 November 2022. Retrieved 25 November 2022.
  2. 2.0 2.1 "PM Kaushal Vikas Yojana: Objectives, Features, Benefits, Eligibility & How to Apply". Digit Insurance (in Indian English). Retrieved 2022-11-25.
  3. "Pradhan Mantri Kaushal Vikas Yojana - Transforming India". transformingindia.mygov.in. Retrieved 2022-11-25.
  4. "Pradhan Mantri Kaushal Vikas Yojana 2.0 (PMKVY 2.0) 2016-20 | Ministry of Skill Development and Entrepreneurship | Goverment Of India". www.msde.gov.in. Retrieved 2022-11-25.