ప్రపంచ అటవీ దినోత్సవం
Appearance
ప్రపంచ అటవీ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ |
జరుపుకొనే రోజు | 21 మార్చి |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21 న నిర్వహించబడుతుంది. 2012, నవంబరు 28న యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం, 2013 మార్చి 21న తొలిసారిగా నిర్వహించబడింది.[1] ప్రస్తుత, ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను తెలియజేయడంకోసం ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.[2][3]
ప్రారంభం
[మార్చు]1971, నవంబరులో ఆహార, వ్యవసాయ సంస్థ యొక్క "స్టేట్స్ సభ్యులు" జరిపిన 16 వ సమావేశంలో ప్రతి సంవత్సరం మార్చి 21 న "ప్రపంచ అటవీ దినోత్సవం" జరపడానికి మద్దతు ఇచ్చారు.[1]
కార్యక్రమాలు
[మార్చు]- 2013: మొదటి ప్రపంచ అటవీ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో చెట్లు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు జరిపి, ఆయా కార్యక్రమాల ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేశారు.[4][5]
- 2014: "మై ఫారెస్ట్ | అవర్ ఫ్యూచర్" అనే పేరుతో ప్రచారంచేసి, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అటవీ ప్రాంతాలతో సంబంధం ఏర్పరుచుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టడం జరిగింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో "అడవుల స్థిరమైన అభివృద్ధి మార్పుకి మహిళల పాత్ర" అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది.[6][7]
- 2015: "అడవులు | వాతావరణం | మార్పు" అనే నేపథ్యంతో ప్రచారం చేయబడింది.[8]
- 2017: "అడవులు, శక్తి" అనే నేపథ్యంను తీసుకోబడింది.[9] ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 19 ప్రధాన కార్యక్రమాలు జరిగినట్టు ఆహార, వ్యవసాయ సంస్థ అధికారిక వెబ్సైట్ లో పెట్టబడింది.[10]
- 2018: "ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్" అనే నేపథ్యంతో ప్రచారం చేయబడింది.[11]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "International Day of Forests," Archived 2020-03-28 at the Wayback Machine United Nations General Assembly, November 28, 2012.
- ↑ Holmgren, Peter. 2013, March 21. "Sharing positive views about forests and trees on the International Day of Forests," CIFOR. Accessed: 22 March, 2019.
- ↑ "21 Reasons To Celebrate The Value Of Trees In Honor Of International Day Of Forests". Huffington Post. Retrieved 22 March 2019.
- ↑ "International Day of Forests - 2013 Celebrations," UN Forum on Forests. Accessed: 22 March 20189
- ↑ "Celebrating International Day of Forests 2013," Archived 2016-02-27 at the Wayback Machine FAO.org. Accessed: 22 March 2019.
- ↑ "International Day of Forests - 2014 Celebrations," UN Forum on Forests. Accessed: 22 March 2019.
- ↑ "Celebrating International Day of Forests 2014," Archived 2016-02-27 at the Wayback Machine FAO.org. Accessed: 22 March 2019.
- ↑ "International Day of Forests 2016". FAO Web Site. FAO. Retrieved 22 March 2019.
- ↑ "International Day of Forests 2017". FAO Web Site. FAO. Archived from the original on 22 మార్చి 2019. Retrieved 22 March 2019.
- ↑ "International Day of Forests 2017 Events". FAO Web Site. FAO. Archived from the original on 22 మార్చి 2019. Retrieved 22 March 2019.
- ↑ "International Day of Forests 2018". FAO Web Site. FAO. Retrieved 22 March 2019.