Jump to content

ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఐక్యరాజ్య సమితి
జరుపుకొనే రోజుఅక్టోబరు 24
సంబంధిత పండుగఐక్యరాజ్యసమితి దినోత్సవం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం (ఆంగ్లం: World Development Information Day) ప్రతి సంవత్సరం అక్టోబరు 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచదేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]

చరిత్ర

[మార్చు]

1972, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించిన తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది.

1972, మే 17న ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సమావేశం సమాచార వ్యాప్తికి, వాణిజ్య, అభివృద్ధి సమస్యలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సమీకరించటానికి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని 3038 (XXVII) గా పిలుస్తారు, దీనిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972, డిసెంబరు 19న ఆమోదించింది. అభివృద్ధి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ప్రవేశపెట్టాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం మొట్టమొదటసారిగా 1973, అక్టోబరు 24న జరుపబడింది.

లక్ష్యం

[మార్చు]

ప్రతి సంవత్సరం అభివృద్ధి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాటి పరిష్కరానికి అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందించడం

కార్యక్రమాలు

[మార్చు]
  1. వివిధ రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కావలసిన అవకాశాలు, నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేయడం

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, మెదక్ (24 October 2019). "ప్రగతి సాధనకు కావాలో శిక్షణ". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 24 October 2019. Retrieved 24 October 2019.

ఇతర లంకెలు

[మార్చు]