ప్రపంచ ఆస్తమా దినం
ప్రపంచ ఆస్తమా దినం | |
---|---|
రకం | 6 |
ప్రారంభం | మే మాసంలో మొదటి మంగళవారం |
ఆవృత్తి | ప్రతీయేడు |
ప్రపంచ ఆస్తమా దినం (ఆగ్లం: World Asthma Day) ఇది ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా లేదా ఉబ్బసం పట్ల అవగాహన, సంరక్షణను మెరుగుపరచడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) ద్వారా నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ప్రపంచ ఆస్తమా దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం జరుపుకుంటారు.[1] 2022 సంవత్సరం మే 3న నిర్వహిస్తున్నారు.[2]
ఆస్తమా అంటే
[మార్చు]దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలలో వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో శ్వాస ఆటంకంగా మారుతుంది. ఏదైనా చిన్న పనిచేసినా కూడా ఆయాసం వస్తుంది. ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. భారతదేశంలో 5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆస్తమా తీవ్రత వల్ల వచ్చే పరిణామాలు అత్యంత ప్రమాద కరమైనవి. ఆస్తమా వల్ల మరణించడం దురదృష్టకరం. ఆస్తమాను పూర్తిగా నయం చేయలేకపోయినా, దాని బారిన పడకుండా కొంత మేరకైనా నియంత్రించవచ్చని డబ్ల్యు.హెచ్.ఓ పేర్కొంది.
నేపథ్యం
[మార్చు]ప్రపంచ ఆస్తమా దినోత్సవం 1998లో ప్రారంభమైంది.[3] ప్రతీయేడు ఒక థీమ్ తో ఆస్తమాపై విశ్వమంతా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. అవి 2021లో "ఆస్తమా అపోహలను తొలగించడం", 2022లో "ఆస్తమా సంరక్షణలో అంతరాలు - అవగాహన".
మూలాలు
[మార్చు]- ↑ "NIH Statement on World Asthma Day 2021". nih.gov. National Institutes of Health. 5 May 2021. Retrieved 22 December 2021.
- ↑ "World Asthma Day 2022". ginasthma.org. Global Initiative for Asthma. 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ "World Asthma Day 2011: "You Can Control Your Asthma"". Medical News Today. www.medilexicon.org. May 3, 2011. Retrieved 2012-04-14.