ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | 28 జూలై |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. కాలేయ వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరుపబడుతుంది.[1]
ప్రారంభం
[మార్చు]ఈ కాలేయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజలపై ప్రభావితం చూపిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత వల్ల దీర్ఘకాలిక వ్యాధికి గురై ప్రతి సంవత్సరం 1.34 మిలియన్ల మంది చనిపోతున్నారు.[2]
2004, అక్టోబరు 1న యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్ పేషెంట్ గ్రూప్స్, బేబీ మురియెల్ సమన్వయంతో అంతర్జాతీయ హెపటైటిస్ సి అవగాహన దినోత్సవం జరిగింది.[3] వేరువేరు సమూహాలు వేర్వేరు తేదీలలో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి.[4] ఈ కారణంగా 2008లో వివిధ ప్రాంతాలలోని రోగుల సమూహాల సహకారంతో ప్రపంచ హెపటైటిస్ అలయన్స్ సంస్థ మే 19ను మొదటి ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించింది.
కాలేయ వ్యాధి దినోత్సవం నిర్వహించాలన్న ఆలోచన కటక్ లో వచ్చింది. హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కటక్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ ప్రతిపాదించాడు. 2010, మే నెలలో జరిగిన 63వ ప్రపంచ ఆరోగ్య సభలో ఈ ప్రతిపాదన ఆమోదించబడి, జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించబడింది.[5]
కార్యక్రమాలు
[మార్చు]ప్రతి సంవత్సరం 100కి పైగా దేశాలలో ప్రదర్శనలు, ప్రచారాలు, కచేరీలు, టాక్ షోలు, ఫ్లాష్ మాబ్స్, టీకా డ్రైవ్‌లు వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.[6] ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ సమూహాలు, రోగులు, న్యాయవాదులు జూలై 28న జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ నివేదికను ప్రచురిస్తాయి.
ఇతర వివరాలు
[మార్చు]- ప్రపంచ ఆరోగ్య అవసరాల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటుచేసిన ఎనమిది అవగాహన కార్యక్రమాల్లో ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం ఒకటి.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (26 July 2016). "కామెర్లతో కాలేయానికి కష్టం!". డాక్టర్ ఎం.వి.రమణయ్య. Archived from the original on 27 జూలై 2016. Retrieved 28 July 2019.
- ↑ World Health Organization, World Hepatitis Day. Accessed 28 July 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-26. Retrieved 2019-07-28.
- ↑ "World Hepatitis Alliance Calls on Governments to Take Urgent Action to Tackle Chronic Viral Hepatitis B & C Epidemic; 2008" (PDF). World Hepatitis Day: Home Page (Press release). World Hepatitis Alliance. Archived from the original (PDF) on 19 డిసెంబరు 2008. Retrieved 28 July 2019.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (23 July 2018). "హెపటైటిస్‌ని తొలగిద్దాం". డాక్టర్ సురేష్‌కుమార్ వి. Archived from the original on 28 జూలై 2019. Retrieved 28 July 2019.
- ↑ World Hepatitis Alliance, World Hepatitis Day Wrap-Up Report 2012. Archived 2013-08-03 at the Wayback Machine
- ↑ World Health Organization, WHO campaigns. Archived 2016-04-22 at the Wayback Machine
- ↑ World Health Organization, WHO campaigns. Archived 22 ఏప్రిల్ 2016 at the Wayback Machine Geneva, 5 January 2015.