Jump to content

ప్రపంచ గిరిజన దినోత్సవం

వికీపీడియా నుండి

ప్రపంచ గిరిజన దినోత్సవంను ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఆగస్టు 9న జరుపుకుంటారు.

నేపథ్యం

[మార్చు]

ప్రపంచంలోని గిరిజనుల సాధన బాధకాలు తెలియజేయమని ఐక్యరాజ్యసమితి 1982లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5,000 తెగలు, 37 కోట్ల గిరిజనుల జనాభాను గుర్తించి, 1994 ఆగస్టు 9వ తేదీన ఈ కమిషన్ ఐక్యరాజ్యసమితికి గిరిజనులకు సంబంధించి ఒక నివేదికను అందించింది. 1996లో ఐక్యరాజ్యసమితి గిరిజనుల హక్కులపై ముఖ్యమైన తీర్మానం చేసింది. ఐక్యరాజ్యసమితి గిరిజనులకు స్వయం పరిపాలన హక్కు, సంస్కృతి, భాష, సాంప్రదాయాలను కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకొనే హక్కు, సంఘ నిర్మాణం చేసుకునే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా నిర్మించుకునే హక్కు, భూమిపై గిరిజన తెగల యాజమాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసిందిగా ప్రభుత్వాలను కోరే హక్కు, చట్టాల రూపకల్పనలో గిరిజన తెగలకు తగు ప్రాతినిధ్యము కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయితీలు పొందే హక్కు, ఐక్యరాజ్యసమితిలో గిరిజన తెగలకు సభ్యత్వం కలిగియుండే హక్కు, వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపివేయుట వంటి హక్కులను పొందుపరచి చర్యను ప్రవేశపెట్టి, తీర్మానం చేసింది. 1997 సెప్టెంబరులో దీనిపై ఓటింగ్ పెట్టగా, 143 దేశాలు అనుకూలంగా ఓటింగ్ వేయగా, 4 దేశాలు వ్యతిరేకంగా, 11 దేశాలు తటస్థంగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి.

భారతదేశ జనాభాలో

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 8.2% అనగా 8.44 కోట్ల గిరిజన జనాభా ఉంది. ఈ జనాభాలో 461 రకాల గిరిజన తెగలు ఉండగా, 92% వరకు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 08-08-2014