ప్రపంచ జానపద దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానపద జాతర 2018లో భాగవత కళాకారులు

ప్రపంచ జానపద దినోత్సవం (ఆంగ్లం: world folklore day) ఒక సమూహంగా జీవించే వారి ఆటపాటలే జానపదం. ఈ ఫోక్ అనే పదాన్ని 1846 ఆగస్టు 22న విలియం జాన్ థామ్స్ అనే భాషాశాస్త్ర వేత్త తొలిసారి ఉపయోగించాడు. ఆయన స్ఫూర్తితోనే వరల్డ్ ఫోక్‌లోర్ డే ప్రతీ ఆగస్టు 22న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.[1]

తెలుగునాట జానపదులు[మార్చు]

18వ శతాబ్దంలో మదరాస్ సర్వేయర్ జనరల్‌గా నియమితులైన కల్నల్ కాలిన్ మెర్గంజీ, కావలి వెంకట బొర్రయ్య సహకారంతో గ్రామ వివరాల సేకరణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో జానపదుల జీవన విధానంపై అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. కాగా 19వ శతాబ్దంలో తెలుగువారి శిష్ట సాహిత్యాన్ని, కళారూపాలను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి సీపీ బ్రౌన్.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని జానపద కళలను ప్రోత్సహించడానికి 2015 నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలకు జానపద జాతర అని పేరు పెట్టింది.[2]

మూలాలు[మార్చు]

  1. "నేడు అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Janapada Jatara from tomorrow". thehindu.com. The HIndu. 21 August 2016.