ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ గుర్తు
జరుపుకొనే రోజుమే 31
ఉత్సవాలుమే 31
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జరుతుగున్న అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్యను 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గించగలిగారు.[1]

నష్టాలు[మార్చు]

పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే.

మూలాలు[మార్చు]

  1. సాక్షి, జాతీయం (31 May 2018). "జీవితానికి పొగ". Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.