ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
స్వరూపం
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అంతర్జాతీయంగా |
రకం | అంతర్జాతీయం |
ప్రారంభం | నవంబరు 20 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.
చరిత్ర
[మార్చు]1954, డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959, నవంబరు 20న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది.[1] 1989, నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్ ఆమోదించింది. చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబరు 20 న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తున్నారు.[2]
కార్యక్రమాలు
[మార్చు]- ప్రపంచవ్యాప్తంగా వివిధ స్వచ్చంధ సంస్థల అధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించబడుతాయి.
- బాలల సంక్షేమం, ఛైల్డ్ వేల్పేర్, విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 November 2019). "బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
- ↑ ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్ (19 November 2019). "బాలల హక్కులను కాపాడుదాం." www.andhrabhoomi.net. డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి. Archived from the original on 7 December 2019. Retrieved 7 July 2020.