ప్రపంచ మత్స్య దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ మత్స్య దినోత్సవం
జరుపుకొనే రోజునవంబరు 21
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రపంచ మత్స్య దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా జరుపబడుతోంది.[1] మత్స్యకారులకు గుర్తింపును అందించడంకోసం, మత్స్య పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతో ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియపరచడానికి మత్స్యకార సంఘాలు ఈ దినోత్సవం నిర్వహిస్తాయి.[2]

ప్రారంభం[మార్చు]

1997లో న్యూఢిల్లీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్య్సకారులు, వ్యాపారస్తులు సమవేశమై దీనిపై సుదీర్షంగా చర్చించారు. 1998లో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో పాల్గొన్న అన్ని దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రతి సంవత్సం నవంబరు 21ని ప్రపంచ మత్య్స దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆ సదస్సు వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలుపునిచ్చాడు. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి, నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.[3]

కార్యకలాపాలు[మార్చు]

  1. ఈ రోజున బైక్ ర్యాలీలు, కార్ల మార్చి‌ల నిర్వహిస్తారు.
  2. మత్స్యకారులు వారి స్వంత ప్రత్యేకమైన, విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి నృత్యం, పాటల, నాటక ప్రదర్శనలు చేస్తారు.
  3. సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి ఓవర్ ఫిషింగ్, యాంత్రీకరణ వంటి సమస్యలను హైలైట్ చేయడంతోపాటు ప్రపంచంలోని మత్స్య సంపదను కాపాడుకునే విధంగా తీసుకోవలసిన చర్యల గురించి, ప్రపంచ పర్యావరణం ఎదుర్కొంటున్న, వాతారవణంలో పెరుగుతున్న సమస్యల మీద ఈ చర్చలు జరుపుతారు.

మూలాలు[మార్చు]

  1. "మత్స్యజాతులకు కాలుష్యం కాటు". EENADU. 2022-11-21. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
  2. ABN (2022-11-21). "World Fisheries Day: భారత్‌ ప్రస్తుతం చేపల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉందంటే..." Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
  3. "ఇవాళ ప్రపంచ మత్య్స దినోత్సవం". Samayam Telugu. 2015-11-25. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.