ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌
జరుపుకొనే రోజుమే 8
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది.[1] నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.[2][3][4][5]

వివిధ స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న వారికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌర‌వార్ధంగా ఈ దినోత్స‌వం ఏర్పాటు చేయబడింది.

చరిత్ర[మార్చు]

యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకుని, ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా "రెడ్‌క్రాస్ సొసైటీ" అనే సేవా సంస్థ ఏర్పాటయింది. అంత‌ర్జాతీయ క‌మిష‌న్ శాంతికి ప్ర‌ధాన స‌హ‌కారిగా రెడ్‌క్రాస్‌ను ప్ర‌వేశపెట్టింది.

1934లో టోక్యోలో జరిగిన 15వ అంత‌ర్జాతీయ‌స‌ద‌స్సులో రెడ్‌క్రాస్ ట్రూస్ సూత్రాలను ఆమోదించి, వాటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాకు వ‌ర్తించేలా అమ‌లుచేశారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతిని ప్ర‌పంచ రెడ్‌క్రాస్ దినోత్స‌వంగా జ‌రుపుకునే ప్ర‌తిపాద‌న‌ 1948, మే 8న ఆమోదించబడింది. 1984లో అధికారికంగా ప్ర‌పంచ రెడ్‌క్రాస్ రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మార్చబడింది.[6]

కార్యక్రమాలు[మార్చు]

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు చేస్తున్న సేవా కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించ‌డానికి అంత‌ర్జాతీయ రెడ్‌క్రాస్ క‌మిటీ, దాని స‌భ్యులు ఈ దినోత్సవం సందర్భంగా వివిధ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Foreign Secretary marks World Red Cross and Red Crescent Day". gov.uk. Retrieved 8 May 2020.
  2. International Committee of the Red Cross (7 May 2003). "World Red Cross Red Crescent Day". Retrieved 8 May 2020.
  3. "World Red Cross Red Crescent Day – 8 May 2013". Education Scotland. Archived from the original on 20 నవంబరు 2016. Retrieved 8 May 2020.
  4. "International Red Cross and Red Crescent Day". South African Government Information. 10 November 2010. Archived from the original on 10 జనవరి 2012. Retrieved 8 మే 2020.
  5. "We observe World Red Cross and Red Crescent Day 2012". Tempo. 8 May 2012. Archived from the original on 19 ఫిబ్రవరి 2020. Retrieved 8 May 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (7 May 2020). "మే 08న ప్ర‌పంచ రెడ్‌క్రాస్ దినోత్స‌వం". www.sakshieducation.com. Archived from the original on 8 మే 2020. Retrieved 8 May 2020.

ఇతర లంకెలు[మార్చు]