ప్రపంచ రేడియో దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ రేడియో దినోత్సవం
ప్రపంచ రేడియో దినోత్సవం
రేడియో
జరుపుకొనేవారుయునెస్కో
జరుపుకొనే రోజు13 ఫిబ్రవరి

ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది.[1] రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

2010, సెప్టెంబరు 20న స్పెయిన్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు స్పానిష్ రేడియో అకాడమీ ప్రపంచ రేడియో దినోత్సవం ప్రకటన ఎజెండాలో చేర్చాలని అభ్యర్థన పంపింది.[2][3] 2011, సెప్టెంబరు 29న యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు తన తాత్కాలిక ఎజెండాలో "ప్రపంచ రేడియో దినోత్సవం" ప్రకటించే అంశాన్ని చేర్చింది. 2011లో యునెస్కో తన పరిధిలోవున్న ప్రసార సంఘాలు, యుఎన్ ఏజెన్సీలు, ఎన్జిఓలు, ఫౌండేషన్లు, ద్వైపాక్షిక అభివృద్ధి సంస్థలు, యునెస్కో శాశ్వత ప్రతినిధులు, జాతీయ కమీషన్ల వంటి సంస్థలతో ఈ దినోత్సవంపై విస్తృత సంప్రదింపులు జరిపింది. అరబ్ స్టేట్స్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్, ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్, కరేబియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్, యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్, నార్త్ అమెరికన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ఆర్గనైజేషన్ డి టెలికమ్యూనికేషన్స్ వంటి 91% సంస్థలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ సంప్రదింపులకు సంబంధించిన వివరాలు యునెస్కో 187 ఈఎక్స్/13 పత్రంలో లభిస్తాయి.[4][5]

1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్‌లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది.[6] ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.[7][8][9]

కార్యక్రమాలు[మార్చు]

 • స్త్రీ పురుషుల సమానత్వం కోసం లింగబేధం సంబంధిత అంశాల, విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టేందుకు రేడియో స్టేషన్ యజమానులకు, ప్రభుత్వాలకు, కార్యదర్శులకు యునెస్కో అవగాహన కల్పిస్తుంది.
 • మహిళా రేడియో జర్నలిస్టుల రక్షణను పెంపొందించడం కోసం కృషి చేస్తుంది.

మూలాలు[మార్చు]

 1. ఈనాడు, జిల్లాలు (13 February 2020). "ఆ పాత మధురం.. ఆనంద శ్రవణం". www.eenadu.net. Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 2. ప్రజాశక్తి, స్నేహ (11 February 2017). "రేడియో సంబరం". Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 3. వార్త, సంపాదకీయం (12 February 2020). "ప్రసార మాధ్యమాలలో రేడియోది చెరగని ముద్ర". Vaartha. డాక్టర్‌ ఆర్‌. ఆదిరెడ్డి. Archived from the original on 12 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 4. "UNESCO Session 187EX/13" (PDF). UNESCO. UNESCO. 26 Aug 2011. Retrieved 13 February 2020. The Director-General submits for the approval of the Executive Board, the feasibility study for the proclamation of a World Radio Day...
 5. UNESCO (10 Jul 2011). "13 February proposed as World Radio Day | United Nations Educational, Scientific and Cultural Organization". UNESCO. Retrieved 13 February 2020.
 6. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్ (12 February 2020). "మనసును దోచే సజీవ సాధనం 'రేడియో'". కంచర్ల సుబ్బానాయుడు. Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 7. File 36 C/63, UNESCO's General Conference Resolution http://unesdoc.unesco.org/images/0021/002131/213174e.pdf
 8. Proclamation, Resolution 63 http://unesdoc.unesco.org/images/0021/002150/215084e.pdf
 9. UN General Assembly file http://www.un.org/ga/search/view_doc.asp?symbol=A/RES/67/124