ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | వన్యప్రాణుల దినోత్సవం |
జరుపుకొనేవారు | ఐక్యరాజ్యసమితి సభ్యులు |
జరుపుకొనే రోజు | 3 మార్చి |
ఉత్సవాలు | ప్రపంచ అడవి జంతుజాలం, వృక్షజాలం గురించి వేడుకలు జరుపుకునేందుకు, అవగాహన పెంచడం |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించబడుతోంది.[1] అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు.
చరిత్ర
[మార్చు]2013, డిసెంబరు 20న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దాని 68వ సెషన్ యుఎన్ 68/205 తీర్మానంలో, మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రకటించింది.[2]
తీర్మానం
[మార్చు]ఈ తీర్మానంలో,[3] వన్యప్రాణుల అంతర్గత విలువను, పర్యావరణ, జన్యు, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, వినోద అభివృద్ధికి, మానవ శ్రేయస్సు కోసం వివిధ రచనలు చేయాలని తీర్మానించింది.
2013, మార్చి 3 నుండి 14 వరకు బ్యాంకాక్‌లో జరిగిన 16వ సమావేశాన్ని జనరల్ అసెంబ్లీ గమనించింది.[4] ప్రపంచ అడవి జంతుజాలం, వృక్షజాలం గురించి వేడుకలు జరుపుకునేందుకు, అవగాహన పెంచడానికి మార్చి 3 ను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా పేర్కొనడం, అంతర్జాతీయ వాణిజ్యం జాతుల మనుగడకు ముప్పు కలిగించకుండా చూసుకోవడంలోని ముఖ్య పాత్రను గుర్తించింది.[5]
ఇతర వివరాలు
[మార్చు]- భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం 1972లో చట్టం చేశారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (1 March 2020). "ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు". Sakshi. Archived from the original on 16 May 2020. Retrieved 3 March 2021.
- ↑ "CITES CoP16 document CoP16 Doc. 24 (Rev. 1) on World Wildlife Day" (PDF).
- ↑ "Resolution of the United Nations General Assembly on World Wildlife Day" (PDF).
- ↑ "Resolution Conf. 16.1 of the Conference of the Parties to CITES on World Wildlife Day". Archived from the original on 2016-08-04. Retrieved 2021-03-03.
- ↑ "Rio+20 recognizes the important role of CITES". Archived from the original on 2017-07-14. Retrieved 2021-03-03.
- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయం (2 March 2020). "జీవులను బతుకనిద్దాం". ntnews. నెరుపటి ఆనంద్. Archived from the original on 3 March 2021. Retrieved 3 March 2021.