ప్రపంచ వినికిడి దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వినికిడి దినోత్సవ లోగో
జరుపుకొనే రోజుమార్చి 3
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రపంచ వినికిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహించబడుతుంది. వినికిడి లోపానికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

చరిత్ర

[మార్చు]

వినికిడి గురించి మానవాళికి ప్రచారం కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007, మార్చి 3న ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.[1] 2016కి ముందు దీనిని అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం అని పిలిచేవారు.[2]ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంధత్వం, చెవుడు నివారణ కార్యాలయం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

కార్యక్రమాలు

[మార్చు]

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థీమ్‌ను ఎంచుకుంటుంది. ఈ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలు, ప్రచార సామాగ్రిని అనేక భాషలలో తయూరుచేసి, ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలను సమన్వయం చేయడంతోపాటు, ఆయా కార్యక్రమాల నివేదికను తయారుచేస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "World Hearing Day: 3 March". WHO. Retrieved 3 March 2020.
  2. "International Ear Care Day: 3 March". WHO. Retrieved 3 March 2020.

ఇతర లంకెలు

[మార్చు]