Jump to content

ప్రపంచ శాకాహార దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ శాకాహార దినోత్సవం
ప్రపంచ శాకాహార దినోత్సవం
శాకాహార పదార్థాలు
అధికారిక పేరుప్రపంచ శాకాహార దినోత్సవం
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా ఉన్న శాకాహారులు
ప్రాముఖ్యతశాకాహార అవగాహన తొలిరోజు
ప్రారంభంఅక్టోబరు 1
ముగింపునవంబరు 1
జరుపుకొనే రోజుఅక్టోబరు 1
సంబంధిత పండుగశాకాహార అవగాహన నెల,
ప్రపంచ వ్యవసాయ జంతువుల దినోత్సవం,
అంతర్జాతీయ శాకాహార వారం,
ప్రపంచ వేగన్ దినోత్సవం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ శాకాహార దినోత్సవం(ఆంగ్లం: World Vegetarian Day) - ప్రతి సంవత్సరం అక్టోబరు 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మూగజీవాలపై మానవ ప్రేమను ప్రోత్సహించి, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేదిశగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.[1][2]

ప్రారంభం

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా శాకాహారులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు 1970లలో ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ ఏర్పడింది. 1977లో తొలిసారిగా అమెరికాలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా,[3] 1978లో అంతర్జాతీయ శాకాహారం యూనియన్ ఆమోదించింది. ప్రపంచ శాకాహారం దినోత్సవం సందర్భంగా అక్టోబరు నెల శాకాహార అవగాహన నెలగా ప్రారంభిమై, నవంబరు 1న ప్రపంచ వేగన్ దినోత్సవంతో ముగుస్తుంది.[4][5]

కార్యక్రమాలు

[మార్చు]

శాకాహార పద్ధతులు, ప్రయోజనాలను ప్రోత్సహించడానికి స్థానిక, ప్రాంతీయ, జాతీయ సమూహాలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

ఇతర వివరాలు

[మార్చు]

శాకాహారం ప్రాముఖ్యతను తెలిపేందుకు, అవగాహన కలిగించేందుకు వివిధ దినోత్సవాలు కూడా ఉన్నాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. "Home". World Vegetarian Day. Retrieved 2020-10-01.
  2. "North American Vegetarian Society | NAVS | Become a Member". North American Vegetarian Society. Retrieved 2020-10-01.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 October 2016). "శాకాహారం...పోషక విలువలు అధికం". www.andhrajyothy.com. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
  4. "vegetarian-awareness-month". HuffPost (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-04. Retrieved 2020-10-01.
  5. Hultin, Ginger (2014-10-07). "Why Celebrate Vegetarian Awareness Month?". Food & Nutrition Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-07-16. Retrieved 2020-10-01.
  6. "About". World Vegetarian Day. Retrieved 2020-10-01.

ఇతర లంకెలు

[మార్చు]