Jump to content

ప్రమిద

వికీపీడియా నుండి
దీపావళికి వెలిగించిన ప్రమిదలు

ప్రమిద అనేది జ్యోతి వెలిగించేందుకు ఉపయోగించు సాధనం. ప్రమిద దీపం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు.

ప్రమిదలు - రకాలు

[మార్చు]

మట్టి ప్రమిదలు

[మార్చు]
  • ఇత్తడి, రాగి, ఇనుము వంటి లోహ ప్రమిదలు
  • చెట్టు బెరడుతో చేసే ప్రమిదలు (వీటిని నీటిలో వదిలేందుకు వాడుతారు, ఉదాహరణకు అరటి బెరడుతో చేసే ప్రమిదలు)

ఉపయోగాలు- వాడుక

[మార్చు]

వీటిని దేవాలయాల్లో, పూజలలో, పూజా మందిరాల్లో, దేవుని ముందు, దీపావళి వంటి పర్వదినాల్లో, మొక్కులలో, చీకటిగా ఉన్నచోట్లా పలు రకాలుగా వాడుతారు.

ఎంతటి సంపన్నుడైనా దేవాలయానికి వెళ్తే ప్రమిదలతో దీపమెలిగించాలని, ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా సుభిక్షమైన ఫలితాలను పొందవచ్చని ప్రజల విశ్వాసం. ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి నవగ్రహాలకు సంబంధం వుంది. ఇంకా ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని విశ్వాసం.

1. ప్రమిద దీపం -సూర్యుడు

2. నెయ్యి, నూనె- ద్రవపదార్థం - చంద్రుడు

3. వత్తులు - బుధుడు

4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల- అంగారకుడు

5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది.

6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు

7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం

8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం.. కేతువుకు సంకేతం

9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం. శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

అదెలాగంటే.. మానవుడు ఆశలను తగ్గించుకుంటే.. సుఖసంతోషాలు చేకూరుతాయనేందుకు ప్రమిదలో వెలిగే దీపమే నిదర్శనం[1].

మూలాలు

[మార్చు]
  1. selvi. "ప్రమిదలో దీప ప్రజ్వలనకు నవగ్రహాలకు సంబంధం వుందా? ఎలా?". telugu.webdunia.com. Retrieved 2020-04-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రమిద&oldid=4007426" నుండి వెలికితీశారు