ప్రయాగ కామేశ్వరకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రయాగ కామేశ్వరకవి ఒక ప్రాచీన తెలుగు కవి. ఇతడు గోపాలలీలా సుధాలహరి అనే ప్రబంధమును రచించెను. ఇతడు విశాఖపట్టణము నకు చెందినవాడు, వైదిక బ్రాహ్మణుడు, కౌశిక గోత్రుడు, నారసింహ పౌత్రుడు, సర్వేశ్వర పుత్రుడు.

గోపాలలీలా సుధాలహరి[మార్చు]

ఇది మూడు ఆశ్వాసముల ప్రబంధము. దీనిని రచయిత రామతీర్థస్వామికి అంకితము చేసెను. ఇందులోని ఒక పద్యము :

ఉ. దుండగ మేలసేసెదవు తోయజసాయక దండనిల్చి కో
దండము డించి మాచెలికి దండము పెట్టుము రెండుకన్నులన్
నిండిననీరు దోయిటను నించి శపించు దదశ్రువారి నిన్
దండనచేయుఫాలశిఖితండ్రిసుమీ కడుశిక్ష చేయగన్.

మూలాలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  • ఆంధ్ర కవుల చరిత్రము, కందుకూరి వీరేశలింగము, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2005.