ప్రవీణ్ కుమార్ సోబ్తీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవీణ్ కుమార్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ
జననం(1947-12-06)1947 డిసెంబరు 6
సార్హలి కలాన్, పంజాబ్, భారతదేశం
మరణం2022 ఫిబ్రవరి 7(2022-02-07) (వయసు 74)
న్యూఢిల్లీ, భారతదేశం
ఎత్తు6 ft 7 in (201 cm)
బరువు270 పౌండ్లు
క్రీడ
క్రీడఅథ్లెటిక్స్
పోటీ(లు)డిస్కస్‌ త్రో, హ్యామర్‌
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)DT – 56.74 m (1973)
HT – 65.76 m (1969)

ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ (1947 డిసెంబరు 6 - 2022 ఫిబ్రవరి 7) భారతదేశానికి చెందిన హ్యామర్‌, డిస్క్‌త్రో క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, సినిమా నటుడు.

క్రీడా జీవితం[మార్చు]

ప్రవీణ్ కుమార్ 1966 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రోలో చాంపియన్‌గా నిలిచి, హ్యామర్‌ త్రోలో కాంస్యం పతకం గెలిచాడు. ఆయన 1966లో కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యామర్‌ త్రోలో పతకం గెలిచాడు. ప్రవీణ్ కుమార్ 1970 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో చాంపియన్‌గా, 1974 టెహ్రాన్‌ ఆసియా క్రీడల్లో రజతం పతకం సాధించాడు. ఆయన 1968 మెక్సికో, 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

సినీరాజకీయ జీవితం[మార్చు]

ప్రవీణ్‌ కుమార్‌ 1981లో సినీరంగంలోకి నటుడిగా అడుగుపెట్టి 1990వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన పౌరాణిక ధారావాహిక కార్యక్రమం ‘మహాభారత్‌’లో పంచ పాండవుల్లో భీముడిగా నటించి మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన 2013లో రాజకీయాల్లో ప్రవేశించి ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత బీజేపీలో చేరాడు.

మరణం[మార్చు]

ప్రవీణ్‌ కుమార్‌ గుండెపోటుతో రావడంతో 2022 ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలోని తన స్వగృహంలో మరణించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 February 2022). "స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్‌..భీముడిగా గుర్తింపు". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Eenadu (9 February 2022). "మహాభారత్‌ భీముడు ఇకలేరు". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
  3. Andhra Jyothy (9 February 2022). "'మహాభారత్‌' భీముడు పాత్రధారి ప్రవీణ్‌కుమార్‌ సోబ్తీ కన్నుమూత". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.