ప్రసన్న యాదవము
Jump to navigation
Jump to search
ప్రసన్న యాదవము | |
ప్రసన్న యాదవము పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | చిలకమర్తి లక్ష్మీనరసింహం |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | కురుకూరి సుబ్బారావు, సరస్వతి బుక్ డిపో బెజవాడ |
విడుదల: | 1934 |
పేజీలు: | 104 |
ప్రసన్న యాదవము చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నాటకం. ఇది 1934లో ముద్రించబడింది. శ్రీకృష్ణుడు, నరకాసురుడు ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్య నాటకమిది.[1]
ఈ నాటకంలో 5 అంకాలు ఉన్నాయి. ప్రథమాంకంలో నరకుడు స్వర్గమును అక్రమించడం, ద్వితీయాంకంలో ఊర్వశీ - నరకుల సంవాదము, తృతీయాంకంలో నరకుని దుశ్చర్యలు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై బయలుదేరుట, చతుర్థాంకంలో శ్రీకృష్ణ - నరక - సత్యభామ యుద్ధాలు, పంచమాంకంలో శ్రీకృష్ణుడు నరక పుత్రుడైన భగదత్తును ఓదార్చి పదహారు వేల కన్నియలను పరిగ్రహించుట వంటివి ఉన్నాయి.
నాటకంలోని పాత్రలు
[మార్చు]- మహేంద్రుడు - దేవతలరాజు
- బృహస్పతి - దేవగురువు
- జయంతుడు - మహేంద్రుని కుమారుడు
- మాణిభద్రుడు - కుబేరుని సేవకుడు
- నరకాసురుడు - ప్రగ్జ్యోతిషాధిపతియగు రాక్షసరాజు
- పంచజనుడు, నిశుంభుడు, మురుడు - నరకాసురుని బంట్లు
- సూతుడు - నరకుని సారథి
- భగదత్తుడు - నరకాసురుని కుమారుడు
- శంబరుడు - నరకాసురుని మంత్రి
- శుక్రాచార్యుడు - రాక్షసుల గురువు
- చిత్రరధుడు - గంధర్వుడు
- పులహుడు, బృహదశ్వుడు - బదరికాశ్రమ మునులు
- దారకుడు - కృష్ణుని సూతుడు
- దేవలుడు - కృష్ణుని అంతపుర పరిచారకుడు
- శ్రీకృష్ణుడు - కథానాయకుడు
- ఊర్వశి - స్వర్గలోక వేశ్యకాంత
- సత్యభామ - శ్రీకృష్ణుని దేవి
మాలాలు
[మార్చు]- ↑ ప్రసన్న యాదవము, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 250.