ప్రాకృత వాఙ్మయంలో రామకథ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాకృత వాఙ్మయంలో రామకథ తిరుమల రామచంద్ర రాసిన పుస్తకం. రచయిత భాషా శాస్త్రం పట్ల వైజ్ఞానిక దృక్పథంతో భారతి పత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. “జనని సంస్కృతంబు సకల భాషలకును” అన్న వాదన అశాస్త్రీయమని, భాషా శాస్త్రం విషయంలో అనులోమ, ప్రతిలోమాలు సహజమని రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావిస్తాడు.

వ్యాసాలు[మార్చు]

ఈ పుస్తకంలో 9 వ్యాసాలు ఉన్నాయి. అవి

  • ప్రాకృత వాఙ్మయంలో రామకథ : ఇది 1977 మే నెలలో వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి కళాశాల ఏర్పాటు చేసిన "రామాయణ సుధా లహరి" సదస్సులో చదివిన పత్రం ఈ వ్యాసం.[1]
  • వజ్జాలగ్గంలో తెలుగు పదాలు
  • ప్రాకృత ప్రకృతి
  • తెలుగు ప్రాకృతాల సంబంధం
  • అపభ్రంశ వాఙ్మయ పరిచయం
  • తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు
  • బౌద్ధ సాహిత్యం : ఆంధ్ర బౌద్ధాచార్యులు
  • జిన వల్లభుడి మహావీర స్వామి స్తోత్రం
  • దేశీ నామమాలలోని తెలుగు పదాలు

పుస్తకం గురించి[మార్చు]

రచన: డా: తిరుమల రామ చంద్ర:, ప్రచురణ:సంఖ్య: 5, ప్రాకృత అకాడమి, ప్రథమ ముద్రణ: 1992, ప్రతులకు:.... పాకృత అకాడెమి:, బరోడా బ్యాంకు కాలని, న్యూబాకారం, హైదరాబాదు.,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, బ్యాంకు స్త్రీటు, హైదరాబాదు. ధర: రూ.30/-

మూలాలు[మార్చు]

  1. "తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలు Tirumala Ramachandra Aadhyatmika Rachanalu | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-27. Retrieved 2021-04-15.

బాహ్య లంకెలు[మార్చు]