ఈవిడ గుజరాత్ లోని సూరత్లో జన్మించింది. పంచగని లోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత పూణే లోని సింహగడ్ కళాశాలలో ఉన్నతవిద్యను పూర్తిచేసింది. అదే సమయంలో ఆమె చాయాచిత్రాలను చూసి కసంసే అనే టెలివిజన్ ధారావాహికలో అవకాశం వచ్చింది. ఈ విధంగా ఇరవై ఏళ్ళ వయస్సులోనే నటిగా మారింది.