ప్రాథమిక రంగులు
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (ఏప్రిల్ 2017) |
సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని పట్టకం గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని 'కాంతి విశ్లేషణా అంటారు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏదు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే వర్ణపటం అంటారు. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి. అవి 1)ఊదా (Violet), 2)ఇండిగో (Indigo), నీలం (Blue), ఆకుపచ్చ (green), పసుపుపచ్చ (Yellow), నారింజ (Orange), ఎరుపు (Red). ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదారందు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టంగా కనబదుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.
రంగులు రకాలు
[మార్చు]రంగులు రెండు రకాలు అవి 1. ప్రాథమిక రంగులు 2. గౌణ రంగులు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. వీటిని సరియైన నిష్పత్తిలో కలిపినపుడు గౌణ రంగులు యేర్పడుతాయి. ఎరుపు, అకుపచ్చ కలిసినపుడు పసుపు పచ్చ, ఎరుపు, నీలం కలసి నపుడు ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ కలిసినపుడు ముదురు నీలం అనె గౌన రంగులు యేర్పడుతాయి. ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కలిపినట్లైతే దాదాపుగా తెలుపు రంగు యేర్పడుతుంది. (కాంతి రంగులు మాత్రమే, ఇతర రంగులు కాదు)